Telugu Global
National

3 రోజుల్లో 10 వేలు... 50 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటాయి. కేరళలో మొదటి కేసు బయట పడిన 4 నెలల తర్వాత కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. గత మూడు రోజుల్లోనే 10 వేల కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 3,900 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు వచ్చాయి. బుధవారం ఒక్కరోజే 1,233 కేసులు తేలాయి. ముంబైలో పదివేల మార్క్‌ దాటింది. ఒక్క రోజే ముంబై నగరంలో కొత్తగా 769 కేసులు బయటపడడం కలవరపెడుతోంది. మహారాష్ట్ర […]

3 రోజుల్లో 10 వేలు... 50 వేలు దాటిన కరోనా కేసులు
X

దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటాయి. కేరళలో మొదటి కేసు బయట పడిన 4 నెలల తర్వాత కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. గత మూడు రోజుల్లోనే 10 వేల కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 3,900 కేసులు నమోదు అయ్యాయి.

మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు వచ్చాయి. బుధవారం ఒక్కరోజే 1,233 కేసులు తేలాయి. ముంబైలో పదివేల మార్క్‌ దాటింది. ఒక్క రోజే ముంబై నగరంలో కొత్తగా 769 కేసులు బయటపడడం కలవరపెడుతోంది.

మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో 6,200కు పైగా కేసులు రికార్డు అయ్యాయి. ఢిల్లీలో 5 వేలు , ఆ తర్వాత తమిళనాడులో 4 వేల కేసులు బయటపడ్దాయి.

పశ్చిమబెంగాల్‌లో కరోనా మృతుల సంఖ్య పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమబెంగాల్‌లో 1,344 కరోనా కేసులు బయటపడ్డాయి. 140 మంది మృతిచెందారు. 364 మంది ఇప్పటి వరకూ కోలుకున్నారు. అయితే టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడం, మొరాలిటీ రేటు 13.2 శాతంగా ఉండడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టుల సంఖ్య పెంచాలని… లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయాలని సూచించింది.

ఏపీలో ఇప్పటి వరకూ 1,777 కేసులు నమోదు అయ్యాయి. బుధవారం 7,782 శాంపిల్స్‌ పరీక్షిస్తే 60 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారింపబడింది. 729 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 1012 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 36 మంది మృతిచెందారు.

కేరళలో తొలి కేసు జనవరి 30న నమోదైంది. చైనా వూహాన్‌ యూనివర్శిటీలో కేరళ విద్యార్థి చదువుకుంటున్నాడు. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్‌ సోకింది. అయితే దాదాపు నెల రోజుల తర్వాత మనదేశంలో కరోనా కేసులు పెరగడం ప్రారంభమైంది. మార్చి నెలలో వైరస్ వ్యాప్తి వేగంగా జరిగింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు.

First Published:  6 May 2020 8:25 PM GMT
Next Story