Telugu Global
National

కరోనా ఈ డాక్టర్‌కు వరమైంది... ఒక్క దెబ్బకి బిలియనీర్ అయ్యాడు..!

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలనే నాశనం చేసింది. అమెరికా వంటి అతి సంపన్న దేశం కూడా కరోనా దెబ్బకు ఆదాయాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇండియా కూడా లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పలు సడలింపులు ఇచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా కొంత మంది మాత్రం బిలియనీర్లు అయ్యారు. ఆ కోవలో ఇండియాలోని ఒక డాక్టర్ ఆస్తి ఒక బిలియన్ డాలర్ దాటిపోయింది. దానికి కారణం […]

కరోనా ఈ డాక్టర్‌కు వరమైంది... ఒక్క దెబ్బకి బిలియనీర్ అయ్యాడు..!
X

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలనే నాశనం చేసింది. అమెరికా వంటి అతి సంపన్న దేశం కూడా కరోనా దెబ్బకు ఆదాయాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇండియా కూడా లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పలు సడలింపులు ఇచ్చింది.

అయితే కరోనా వైరస్ కారణంగా కొంత మంది మాత్రం బిలియనీర్లు అయ్యారు. ఆ కోవలో ఇండియాలోని ఒక డాక్టర్ ఆస్తి ఒక బిలియన్ డాలర్ దాటిపోయింది. దానికి కారణం ఆయన నిర్వహించే డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ సంస్థే. దేశవ్యాప్తంగా ఆయనకు వందల సంఖ్యలో ల్యాబ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడానికి అనుమతించిన అతి కొద్ది ప్రైవేట్ ల్యాబ్స్‌లో డాక్టర్ లాల్‌వి కూడా ఉన్నాయి.

మార్చి చివరి వారంలో డాక్టర్ లాల్‌కు చెందిన పాథ్‌ల్యాబ్స్‌కు కరోనా టెస్టుల అనుమతి లభించింది. దీంతో స్టాక్‌మార్కెట్లో లిస్టయిన ఆయన సంస్థ షేర్ల విలువ ఒక్క సారిగా పెరిగిపోయింది. 2019 ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ లాల్ చెయిన్‌ విలువ 174 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు ఒక బిలియన్ దాటిపోయింది. ప్రస్తుతం ఇది తమ అతిపెద్ద ల్యాబ్ నెట్‌వర్క్ సాయంతో ఒక రోజులో 5000కి పైగా కరోనా టెస్టులు చేస్తోంది.

డాక్టర్ లాల్ ల్యాబ్స్ కేవలం డయాగ్నొస్టిక్ సెంటర్లు మాత్రమే నడపడం కాకుండా.. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పది రాష్ట్రాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా శాంపిళ్లు సేకరించి, తమ ల్యాబ్‌లలో పరీక్షించి 24 గంటల్లో ఫలితాలను చెబుతోంది. ఇది డాక్టర్ లాల్ సంస్థలకు కలసి వచ్చింది.

First Published:  7 May 2020 1:26 PM IST
Next Story