బోయిస్ లాకర్స్ రూమ్ ఎఫెక్ట్... ఇన్‌స్టాగ్రామ్‌కు పునర్నవి గుడ్‌బై
ఢిల్లీలో కరోనా ఒకవైపు విజృంభిస్తుంటే… బోయిస్ లాకర్ రూమ్ ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ మరోవైపు కలకలం రేపుతోంది. హైక్లాస్ టీనేజ్ కుర్రాళ్లు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లలో ‘బోయిస్ లాకర్స్ రూమ్’ పేరుతో గ్రూప్ క్రియేట్ చేశారు. అమ్మాయిల న్యూడ్ చిత్రాలతో పాటు వాళ్ల గురించి సెక్స్ టాక్, అమ్మాయిల మార్ఫింగ్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా అమ్మాయిల్ని రేప్ చేయడానికి ప్లానింగ్, గ్రూప్ సెక్స్ తదితర అంశాలపై చర్చిస్తున్న చాట్‌లు బయటకు వచ్చాయి. ఈ […]
ఢిల్లీలో కరోనా ఒకవైపు విజృంభిస్తుంటే… బోయిస్ లాకర్ రూమ్ ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ మరోవైపు కలకలం రేపుతోంది. హైక్లాస్ టీనేజ్ కుర్రాళ్లు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లలో ‘బోయిస్ లాకర్స్ రూమ్’ పేరుతో గ్రూప్ క్రియేట్ చేశారు. అమ్మాయిల న్యూడ్ చిత్రాలతో పాటు వాళ్ల గురించి సెక్స్ టాక్, అమ్మాయిల మార్ఫింగ్ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా అమ్మాయిల్ని రేప్ చేయడానికి ప్లానింగ్, గ్రూప్ సెక్స్ తదితర అంశాలపై చర్చిస్తున్న చాట్‌లు బయటకు వచ్చాయి.
ఈ గ్రూప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి ఇన్‌స్టా అడ్మిన్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన విద్యార్థి 12 వ తరగతి విద్యార్థి. నోయిడా స్కూల్‌లో చదువుతున్నాడు. ఏప్రిల్‌లో ఈ గ్రూపు స్టార్ట్ చేశాడు. గ్రూపులో మొత్తం 51 మంది సభ్యులు ఉన్నారు.
ఈ గ్రూప్ చాట్ స్క్రీన్ షాట్స్ ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ గ్రూప్‌పై చర్చలు నడిచాయి. ఈ ఇష్యూపై పునర్నవి తన ఇన్‌స్టా అకౌంట్‌లో రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో పిల్లలు ఎలా ఉండాలో గైడ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే అంటూ స్టోరీ పెట్టింది. దీంతో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సూక్తులు చెబూతూ ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నమంటూ కామెంట్ చేశారు.
దీంతో ఆ స్క్రీన్‌షాట్స్‌ని పునర్నవి పోస్టు చేసింది. కామెంట్స్ పెట్టిన అతని ఫ్రెండ్ లైన్‌లోకి వచ్చి…. మీ వల్ల అతని తల్లిదండ్రుల దగ్గర చీవాట్లు తిన్నాడని అంటూ కించపర్చేలా మాట్లాడారు. దీంతో పునర్నవి వెంటనే ఇన్‌స్టా ఒక్కొక్కసారి విష సాధనంగా మారుతోందని… ఒక్కొక్కసారి తట్టుకోలేకపోతున్నాని అంటూ ఇన్ స్టాకు బ్రేక్ ఇస్తున్నట్లు పోస్టు పెట్టింది.