గ్యాప్ ఇచ్చానంటున్న నారా రోహిత్
తన కెరీర్ కు సంబంధించి గ్యాప్ రాలేదంటున్నాడు హీరో నారా రోహిత్. తనే కావాలని గ్యాప్ ఇచ్చినట్టు ప్రకటించుకున్నాడు. వీరభోగ వసంతరాయలు తర్వాత మళ్లీ తెరపై కనిపించని ఈ నటుడు.. తన ఫిజిక్ ను మార్చుకునేందుకు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నానని చెబుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా ఫిజిక్ మేకోవర్ అయిపోయిందని చెబుతున్నాడు. “నా లుక్ నాకు నచ్చలేదు. అందుకే ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు. పూర్తిగా ఎక్సర్ సైజులు చేయడం స్టార్ట్ చేశాను. డైట్ ప్లాన్ కూడా మార్చాను. […]
తన కెరీర్ కు సంబంధించి గ్యాప్ రాలేదంటున్నాడు హీరో నారా రోహిత్. తనే కావాలని గ్యాప్ ఇచ్చినట్టు ప్రకటించుకున్నాడు. వీరభోగ వసంతరాయలు తర్వాత మళ్లీ తెరపై కనిపించని ఈ నటుడు.. తన ఫిజిక్ ను మార్చుకునేందుకు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నానని చెబుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా ఫిజిక్ మేకోవర్ అయిపోయిందని చెబుతున్నాడు.
“నా లుక్ నాకు నచ్చలేదు. అందుకే ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు. పూర్తిగా ఎక్సర్ సైజులు చేయడం స్టార్ట్ చేశాను. డైట్ ప్లాన్ కూడా మార్చాను. అలా ఇప్పుడు కంప్లీట్ మేకోవర్ అయ్యాను. లాక్ డౌన్ టైమ్ లో కూడా ఎక్సర్ సైజులు మానలేదు. ఇంట్లోనే ఉంటూ డైట్ ఫాలో అవుతూ, ఎక్సర్ సైజ్ లు చేశాను.” అని చెబుతున్నాడు.
ప్రస్తుతం ఈ హీరో స్లిమ్ లుక్ లోకి మారాడు. త్వరలోనే రెండు పెద్ద సినిమాలు ఎనౌన్స్ చేయబోతున్నాడు. రీసెంట్ గా తన లుక్ కు సంబంధించి స్టిల్ కూడా రిలీజ్ చేశాడు రోహిత్. ఫుల్ ప్రొఫైల్ ఫొటో మాత్రం రిలీజ్ చేయలేదు. గతంలో ఉన్న బరువులో సగానికి సగం తగ్గాడని టాక్.