Telugu Global
National

రక్షణ శాఖ బడ్జెట్లో 40 శాతం కోత

రక్షణ శాఖకు కేటాయించే బడ్జెట్లో 20 శాతం కోత విధిస్తే రూ. 40,000 అదా అవుతుంది. 40 శాతం కోత విధిస్తే రూ. 80,000 కోట్లు మిగులుతాయి. కరోనా కష్టకాలం మొదలైన తరవాత రక్షణ శాఖ బడ్జెట్లో కోత విధించడమే మంచిదని, ఆయుధాల కొనుగోలు వాయిదా వేయొచ్చునని ప్రభుత్వం భావిస్తున్నట్టు రక్షణ శాఖ ఉన్నతాధికారి రక్షణ శాఖ విశ్లేషకులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రక్షణ శాఖ వ్యయాన్ని మొత్తం సంవత్సరం […]

రక్షణ శాఖ బడ్జెట్లో 40 శాతం కోత
X

రక్షణ శాఖకు కేటాయించే బడ్జెట్లో 20 శాతం కోత విధిస్తే రూ. 40,000 అదా అవుతుంది. 40 శాతం కోత విధిస్తే రూ. 80,000 కోట్లు మిగులుతాయి. కరోనా కష్టకాలం మొదలైన తరవాత రక్షణ శాఖ బడ్జెట్లో కోత విధించడమే మంచిదని, ఆయుధాల కొనుగోలు వాయిదా వేయొచ్చునని ప్రభుత్వం భావిస్తున్నట్టు రక్షణ శాఖ ఉన్నతాధికారి రక్షణ శాఖ విశ్లేషకులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రక్షణ శాఖ వ్యయాన్ని మొత్తం సంవత్సరం ఖర్చులో 15 నుంచి 20 శాతం తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా త్రైమాసికాల్లో కూడా ఇదే పద్ధతి అనుసరించవచ్చునని రక్షణ శాఖ అధికారి చెప్పారు.

రక్షణ శాఖ ఖర్చులు 20 శాతం ఇతర మంత్రిత్వ శాఖల ఖర్చును 15 శాతం తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాలకు సూచించింది.

అయితే రక్షణ శాఖ సిబ్బంది వేతనల్లో కోత ఉండదు. రక్షణ శాఖ పింఛన్లు, మాజీ సైనిక సిబ్బంది ఆరోగ్య పథకాలలోనూ ఎలాంటి కోత ఉండదు.

స్థూల జాతీయోత్పత్తి తగ్గే అవకాశం ఉందని, అలాంటప్పుడు ప్రతి త్రైమాసికంలో ఖర్చులు 15 నుంచి 20 శాతం తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిన వర్తమానంలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఏటా స్థూల జాతీయోత్పత్తిలో 0.3 శాతం కేటాయిస్తుంది. ఆరోగ్యానికి, వ్యవసాయం లాంటి రంగాల మీద ఎక్కువ ఖర్చు చేయాలంటే తక్కువ ప్రాధాన్యం గల శాఖల ఖర్చు తగ్గించక తప్పదు.

రక్షణ శాఖ కోసం అధిక మొత్తం ఖర్చు చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. విదేశాల నుంచి ఆయుధాలు కొనడానికి బదులు మన దేశంలోనే రక్షణ శాఖకు అవసరమైన సామాగ్రి ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆయుధాల కొనుగోలు మీద ఖర్చు తగ్గిస్తే మన ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి మరింత మొత్తం ఖర్చు చేయవచ్చు.

త్రివిధ రక్షణ దళాల వారు తమ ప్రాధాన్యతలను పునర్నిర్వచించుకుని ఖర్చు తగ్గించవలసి ఉంటుంది. రక్షణ శాఖ ప్రధానాధికారి ఈ పని చేయవలసి ఉంటుంది.

First Published:  6 May 2020 9:18 AM IST
Next Story