జూన్ నుంచి షూటింగ్స్?
తెలంగాణలో వచ్చే నెల నుంచి షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే నెలలో పరిస్థితిని సమీక్షించి ఆ వెంటనే షూటింగ్స్ కు అనుమతి ఇస్తామన్నారు మంత్రి. సినీపరిశ్రమ నుంచి వచ్చిన విన్నపాలన్నింటినీ స్వీకరించిన మంత్రి.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి ప్యాకేజీతో పరిశ్రమను ఆదుకుంటుందని ప్రకటించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించాల్సి ఉందన్నారు. దాదాపు […]
తెలంగాణలో వచ్చే నెల నుంచి షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే నెలలో పరిస్థితిని సమీక్షించి ఆ వెంటనే షూటింగ్స్ కు అనుమతి ఇస్తామన్నారు మంత్రి. సినీపరిశ్రమ నుంచి వచ్చిన విన్నపాలన్నింటినీ స్వీకరించిన మంత్రి.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి ప్యాకేజీతో పరిశ్రమను ఆదుకుంటుందని ప్రకటించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించాల్సి ఉందన్నారు.
దాదాపు 40 రోజులుగా పరిశ్రమలో షూటింగ్స్ ఆగిపోయాయి. కేవలం సినిమాలే కాదు, సీరియల్ షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. దీనికి తోడు మరో 2 నెలల వరకు థియేటర్లు తెరిచే పరిస్థితి లేదంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. టాలీవుడ్ ను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై పడింది. అన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి, టాలీవుడ్ పెద్దలతో చర్చించి ఉత్తమమైన పాలసీతో ముందుకొస్తామన్నారు తలసాని.
ఈ సందర్భంగా కరోనా ప్రభావంతో తెలుగు సినీపరిశ్రమకు కలుగుతున్న నష్టాలను, ప్రభుత్వానికి విన్నవించారు సినీపెద్దలు. తలసానికి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు జరిగిన సమావేశంలో ఫిలింఛాంబర్ సభ్యులు, నిర్మాతల మండలి అధ్యక్షుడు, కార్యదర్శులు పాల్గొన్నారు.