Telugu Global
NEWS

లోకేష్‌ విఫల నాయకుడు " బండ్ల గణేష్‌ ఘాటు వ్యాఖ్యలు

నిర్మాత బండ్ల గణేష్‌ ట్విట్టర్‌లో నారా లోకేష్‌ వ్యవహారశైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడికి కుమారుడిగా మినహా నారా లోకేష్‌కు ఎలాంటి అర్హత లేదు అంటూ వ్యాఖ్యానించారు. తన దృష్టిలో నారా లోకేష్‌ ఒక ఫెయిల్యూర్‌ నాయకుడు అని గణేష్ వ్యాఖ్యానించారు. గౌరవనీయులైన నారా లోకేష్‌ గారికి ప్రేమతో అంటూ ట్వీట్లు మొదలుపెట్టిన బండ్ల గణేష్… ప్రపంచంలో అతి కొద్దిమందికి మాత్రమే దక్కే అదృష్టం చంద్రబాబునాయుడికి కుమారుడిగా నారా లోకేష్‌కు లభించిందన్నారు. మీ తండ్రి మీ గురించి […]

లోకేష్‌ విఫల నాయకుడు  బండ్ల గణేష్‌ ఘాటు వ్యాఖ్యలు
X

నిర్మాత బండ్ల గణేష్‌ ట్విట్టర్‌లో నారా లోకేష్‌ వ్యవహారశైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడికి కుమారుడిగా మినహా నారా లోకేష్‌కు ఎలాంటి అర్హత లేదు అంటూ వ్యాఖ్యానించారు. తన దృష్టిలో నారా లోకేష్‌ ఒక ఫెయిల్యూర్‌ నాయకుడు అని గణేష్ వ్యాఖ్యానించారు.

గౌరవనీయులైన నారా లోకేష్‌ గారికి ప్రేమతో అంటూ ట్వీట్లు మొదలుపెట్టిన బండ్ల గణేష్… ప్రపంచంలో అతి కొద్దిమందికి మాత్రమే దక్కే అదృష్టం చంద్రబాబునాయుడికి కుమారుడిగా నారా లోకేష్‌కు లభించిందన్నారు. మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని కోరుకుంటున్నా అంటూనే… ఈ మధ్య నారా లోకేష్ చేస్తున్న ట్వీట్లు చూస్తుంటే చాలా మంది బాధపడుతున్నారని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వారసత్వం ముఖ్యంకాదని… దమ్ము ధైర్యం, పోరాడుతాడు అన్న విశ్వాసం ప్రజలకు కల్పించడం రాజకీయ నాయకుడి లక్షణం అని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌లాగా… అందరూ ఒక్కటై అణచివేయాలని చూసినా అందర్నీ ఎదిరించి తొమ్మిదేళ్ల పాటు సుధీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలా ఉండాలని నారా లోకేష్‌కు హితవు పలికారు. నెంబర్ వన్ పొజిషన్‌కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌, తండ్రికి పోటీ ఇచ్చేలా తయారైన రాంచరణ్‌ లా తయారవ్వాలని లోకేష్‌కు సలహా ఇచ్చారు.

మిమ్మల్ని చూస్తుంటే రాజకీయాల్లో పట్టు సాధించలేరేమో అన్న భయం తనకు కలుగుతోందని నారాలోకేష్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఇటీవల టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమల ఆలయంలో జరిగిన అభిషేక కార్యక్రమానికి హాజరవడాన్ని విమర్శిస్తూ లోకేష్ పెట్టిన ట్వీట్‌పై బండ్ల గణేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

టీటీడీ చైర్మన్ స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు వస్తే మీరు చేసిన ట్వీట్ మీ దిగజారుడు తనానికి నిదర్శనం అంటూ విమర్శించారు. ఆఖరిలో చంద్రబాబునాయుడు కుమారుడిగా తప్ప రాజకీయంగా మీకు ఏ అర్హత లేదు.. ఎందుకంటే నాకు తెలిసి మీరు రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడు అంటూ లోకేష్‌ను విమర్శించారు బండ్ల గణేష్.

First Published:  5 May 2020 12:37 PM IST
Next Story