ఏడాదిలో 33 శాతం తగ్గిన వైన్‌షాపులు... వ్యవసాయానికి ప్రత్యేక జేసీ
మద్యాన్ని సేవించేవారిని నిరుత్సాహ పరిచేందుకే ధరలు పెంచామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్. 25 శాతం పెంచి… తగ్గించాలనుకుంటే ఢిల్లీలో 70 శాతం పెంచారని, అందుకే ఏపీలో 75 శాతం పెంచామని చెప్పారు. మద్యం షాపుల సంఖ్యను మరో 13 శాతం తగ్గిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 20 శాతం తగ్గించామని, తాజా 13 శాతంతో మొత్తం 33 శాతం తగ్గించినట్లు అవుతుందన్నారు. పర్మిట్ రూమ్‌లను ఇప్పటికే రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే […]
మద్యాన్ని సేవించేవారిని నిరుత్సాహ పరిచేందుకే ధరలు పెంచామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్. 25 శాతం పెంచి… తగ్గించాలనుకుంటే ఢిల్లీలో 70 శాతం పెంచారని, అందుకే ఏపీలో 75 శాతం పెంచామని చెప్పారు. మద్యం షాపుల సంఖ్యను మరో 13 శాతం తగ్గిస్తామని ప్రకటించారు.
ఇప్పటికే 20 శాతం తగ్గించామని, తాజా 13 శాతంతో మొత్తం 33 శాతం తగ్గించినట్లు అవుతుందన్నారు. పర్మిట్ రూమ్‌లను ఇప్పటికే రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేలకు పైగా ఉన్న బెల్టు షాపులను తీసివేశామన్నారు.
కరోనా వ్యాప్తి నివారణపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. ఈ సందర్భంలోనే మద్యం ధరల పెంపుపైనా క్లారిటీ ఇచ్చారు. లాభాపేక్ష లేకుండా ఉండేందుకే మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు. విక్రయ వేళలను ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు పరిమితం చేశామని, అందులో భాగంగానే ఇప్పుడు 75 శాతం రేట్లు పెంచామని చెప్పారు. రేట్లు షాక్ కొట్టించేలా ఉండాలని నిర్ణయించామన్నారు.
దీని వల్ల పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా కాకుండా చూడాల్సిన బాధ్యత ఎస్పీలపైనే ఉంటుందన్నారు. కేవలం ఎక్సైజ్ స్టాఫ్ వల్ల ఇది సాధ్యం కాదని, పోలీసులు దీంట్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. అధికారులపై పూర్తి నమ్మకం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రవాణాకు ఆస్కారం ఇవ్వొద్దని స్పష్టం చేశారు సీఎం జగన్.
మరోవైపు లాక్‌డౌన్ సడలింపులతో వలస కార్మికులు ఏపీకి తిరిగి వస్తున్నారని, వారి విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు ముఖ్యమంత్రి. లక్ష మందికిపైగా వలస కూలీలు వచ్చే అవకాశం ఉందని, మరో లక్ష మంది ఇతరులు కూడా వస్తారని చెప్పారు. వివిధ దేశాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. వీటన్నింటినీ డీల్ చేయాల్సి ఉంటుందని, ఇది కొన్ని నెలలపాటు కొనసాగుతుందని చెప్పారు.
ఇంకోవైపు ప్రతి జిల్లాకు ముగ్గురు జేసీలు ఉండేలా ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. ఎవరెవరు ఏం చేయాలనే దానిపై విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. ఒక జేసీకి పూర్తిగా వ్యవసాయం బాధ్యతలు అప్పగిస్తామన్నారు. నాడు – నేడులో భాగంగా ఆస్పత్రుల అభివృద్ధి, స్కూళ్ల అభివృద్ధి పనుల బాధ్యత జేసీలకు ఇస్తామన్నారు సీఎం జగన్.