Telugu Global
National

సీతక్కపై ప్రశంసల జల్లు

ప్రజల్లో తిరుగుతున్న ఏకైక నేత ఆదివాసీలకు భరోసానిస్తున్న ఎమ్మెల్యే సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ మన దగ్గర వార్డు మెంబర్ అయితేనే అమెరికా అధ్యక్షుడైనంత ఫీలింగ్. అప్పటి వరకు మనతో తిరిగిన మనిషే ఒక పదవి రాగానే కాలర్ ఎగరేస్తుంటారు. ప్రజా సేవ చేయాల్సిన వాళ్లు… ప్రజలనే నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం అందిరినీ కష్టాలపాలు చేస్తోంది. కోవిడ్ 19 బారినపడిన వాళ్లది ఒక గోసైతే.. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కూలీలు, పేదలది […]

సీతక్కపై ప్రశంసల జల్లు
X
  • ప్రజల్లో తిరుగుతున్న ఏకైక నేత
  • ఆదివాసీలకు భరోసానిస్తున్న ఎమ్మెల్యే
  • సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ

మన దగ్గర వార్డు మెంబర్ అయితేనే అమెరికా అధ్యక్షుడైనంత ఫీలింగ్. అప్పటి వరకు మనతో తిరిగిన మనిషే ఒక పదవి రాగానే కాలర్ ఎగరేస్తుంటారు. ప్రజా సేవ చేయాల్సిన వాళ్లు… ప్రజలనే నిర్లక్ష్యం చేస్తుంటారు.

ప్రస్తుతం కరోనా సంక్షోభం అందిరినీ కష్టాలపాలు చేస్తోంది. కోవిడ్ 19 బారినపడిన వాళ్లది ఒక గోసైతే.. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కూలీలు, పేదలది మరో బాధ. పనులు లేక.. నిత్యావసరాలు కొనలేక ఇక్కట్లకు గురవుతున్నారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లోనే అధికారులు సరిగా స్పందించడం లేదు. కరోనా భయంతో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు బయటకు రావడమే మానేశారు. కానీ ఈ కరోనా కష్ట కాలంలో ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం ప్రజల్లో ఉంటోంది. మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి వారికి అవసరమైన నిత్యావసరాలు, ఔషధాలు పంపిణీ చేస్తోంది. ఆమే ములుగు ఎమ్మెల్యే సీతక్క.

కరోనా కష్టకాలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మారుమూల గ్రామలకు కూడా వెళ్తూ అక్కడి ఆదివాసీల్లో భరోసా నింపుతున్నారు. కనీస రహదారి సౌకర్యంలేని గ్రామాలకు కిలోమీటర్ల దూరం నడిచే వెళ్తూ.. రోడ్ల పక్కన, చెట్ల కిందే భోజనం చేస్తూ తన ప్రజల కోసం తపిస్తున్నారు.

ములుగు నియోజకవర్గం మొత్తం అటవీ ప్రాంతం. చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం ఉండదు. రాళ్లు రప్పలతోపాటు గుట్టలతో నిండి ఉంటుంది. అక్కడకు కూడా తాను వెళ్తూ ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు భోజన సౌకర్యలు కల్పిస్తున్నారు. అవసరమైన వారికి తన పరిధిలో చేయాల్సిన సాయం చేస్తున్నారు.

ములుగు నియోజకవర్గంలోని పెనుగోలు గిరిజన గ్రామానికి ఆదివారం సీతక్క వెళ్లారు. వాహనం వెళ్లడానికి కూడా వీలులేకపోవడంతో దాదాపు 20 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. తనతో పాటు తీసుకొని వెళ్లిన కూరగాయల బస్తాను కాసేపు సీతక్క కూడా మోశారు. అలా వాజేడు మండల కేంద్రం నుంచి 20 దూరంలో ఉన్న పెనుగోలుకు చేరుకున్నారు.

తెలంగాణ-చత్తీస్‌గడ్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ప్రజలను పలకరించి వారికి అవసరమైన సాయం చేశారు. ఈ గ్రామానికి వెళ్లిన తొలి ప్రజాప్రతినిధి ఆమేనని అధికారులు చెబుతున్నారు. సీతక్క ఫౌండేషన్, అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ, సర్వర్ ట్రస్టు ఆధ్వర్యంలో గ్రామంలోని 20 కుటుంబాల వారికి నిత్యావసరాలు, దుస్తులు అందించారు. సీతక్క చేసిన సాయానికి అక్కా.. నువ్వు అక్కవి కాదు అమ్మవి అని అంటున్నారు ఆ గ్రామ ప్రజలు.

మరోవైపు సీతక్క చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. సీతక్క పెద్దమనసుకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి.. అధికారులను ఆదేశించే అవకాశం ఉన్నా సరే స్వయంగా తానే మారుమూల గ్రామాలకు వెళ్లి స్వయంగా ప్రజల కష్టాలను తీరుస్తున్నందుకు నెటిజన్లు ఆమెకు హారతులు పడుతున్నారు. ములుగు ప్రజలు చేసుకున్న అదృష్టం సీతక్క అని అంటున్నారు. ఆమె ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్‌లలో షేర్ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

మన ప్రియతమ నాయకురాలు సీతక్క గారికి ఇవాళ తిరుగు ప్రయాణంలో గుట్ట దిగుతుండగా కాలు బెనకడం జరిగింది తీవ్రమైన నొప్పితో అక్క అలమటిస్తూ అవన్నీ దాటుకుంటూ వచ్చి హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది, అక్క తొందరగా కోలుకోవాలని మనమందరం ఆశిద్దాం. By Admin ?#seethakka #ironladyoftelangana #viralvideo #trending

Publiée par Danasari Seethakka sur Dimanche 3 mai 2020

First Published:  4 May 2020 2:36 AM IST
Next Story