Telugu Global
Cinema & Entertainment

రాశిఖన్నా ప్రేమ పెళ్లి

ఒకప్పట్లా ఎఫైర్లు, పెళ్లి-పిల్లలు విషయంలో హీరోయిన్లు గుంభనంగా ఉండడం లేదు. మనసులో ఉన్న మాటను నిర్భయంగా బయటపెడుతున్నారు. ప్రేమిస్తే ఆ విషయాన్ని గొప్పగా ప్రకటిస్తున్నారు కూడా. తాజాగా హీరోయిన్ రాశిఖన్నా కూడా అలానే రియాక్ట్ అయింది. తన పెళ్లికి సంబంధించి కొన్ని విషయాల్ని అభిమానులతో పంచుకుంది. “ప్రేమ పెళ్లి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏదిష్టం అని అడుగుతున్నారు. నాకైతే ప్రేమించి పెళ్లాడ్డమే ఇష్టం. అలాఅని నేను ప్రేమలో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్. నాకు కాబోయే […]

రాశిఖన్నా ప్రేమ పెళ్లి
X

ఒకప్పట్లా ఎఫైర్లు, పెళ్లి-పిల్లలు విషయంలో హీరోయిన్లు గుంభనంగా ఉండడం లేదు. మనసులో ఉన్న మాటను నిర్భయంగా బయటపెడుతున్నారు. ప్రేమిస్తే ఆ విషయాన్ని గొప్పగా ప్రకటిస్తున్నారు కూడా. తాజాగా హీరోయిన్ రాశిఖన్నా కూడా అలానే రియాక్ట్ అయింది. తన పెళ్లికి సంబంధించి కొన్ని విషయాల్ని అభిమానులతో పంచుకుంది.

“ప్రేమ పెళ్లి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏదిష్టం అని అడుగుతున్నారు. నాకైతే ప్రేమించి పెళ్లాడ్డమే ఇష్టం. అలాఅని నేను ప్రేమలో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్. నాకు కాబోయే భర్త పొడుగ్గా ఉండాలి. ఎందుకంటే నేను కాస్త హైట్ ఉంటాను. మంచి హృదయం ఉన్నవాడై ఉండాలి.”

ఇలా ప్రేమ-పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది రాశీఖన్నా. ఈ సందర్భంగా తన అప్ కమింగ్ మూవీ విశేషాల్ని కూడా వెల్లడించింది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా రాబోతున్న సినిమాలో తనే హీరోయిన్ గా నటించబోతున్నట్టు ప్రకటించింది. నిజానికి ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారని అనుకున్నారు. కానీ రాశిఖన్నా ప్రకటనతో సూర్య సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై స్పష్టత వచ్చేసింది.

ఇక తెలుగులో కూడా రెండు సినిమాలకు కాల్షీట్లు కేటాయించినట్టు తెలిపింది రాశిఖన్నా. అగ్రిమెంట్ అవ్వలేదు కాబట్టి వాటిని ఇంకా అధికారికంగా ప్రకటించలేనని అంటోంది. చూస్తుంటే.. తెలుగులో ఏదో పెద్ద హీరో సరసన ఆమె ఛాన్స్ కొట్టేసినట్టుంది.

First Published:  4 May 2020 10:59 AM IST
Next Story