Telugu Global
National

ఏపీలో 25 శాతం పెరిగిన మద్యం ధరలు

ఏపీలో మద్యనియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే షాపులు తగ్గించింది. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయం కూడా తగ్గించింది. ఇప్పుడు మద్యం ధరలు 25 శాతం పెంచింది. ఏపీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మాస్క్‌ ధరించనివారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. లాక్‌ డౌన్‌ తర్వాత ఇవాళ ఉదయం 11 గంటల నుంచి షాపులు […]

ఏపీలో 25 శాతం పెరిగిన మద్యం ధరలు
X

ఏపీలో మద్యనియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే షాపులు తగ్గించింది. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయం కూడా తగ్గించింది. ఇప్పుడు మద్యం ధరలు 25 శాతం పెంచింది.

ఏపీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మాస్క్‌ ధరించనివారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

లాక్‌ డౌన్‌ తర్వాత ఇవాళ ఉదయం 11 గంటల నుంచి షాపులు తెరిచారు. కొత్త ధరల ప్రకారం.. గతంలో రూ.120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.20 పెంచారు. అలాగే హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెంచారు. ఇక రూ.120-150 ధర ఉన్న క్వార్టర్‌ బాటిళ్లపై రూ.40 పెంచారు. ఇక మినీ బీర్‌పై రూ.20, ఫుల్ బీర్‌పై రూ.30 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు గ్రీన్‌జోన్‌లో లిక్కర్‌ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తెలంగాణలో మాత్రం వైన్‌ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే రేపోమాపో ఇక్కడ కూడా దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం తయారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

First Published:  4 May 2020 5:48 AM IST
Next Story