Telugu Global
National

వారం పది రోజులకే కోలుకుంటున్న యూత్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఈ పరిణామం బాధితులతో పాటు ప్రభుత్వానికి, వైద్యులకు పెద్ద ఊరటగా ఉంటోంది. ఆరోగ్యంగా ఉన్న యువకులు కరోనా బారిన పడ్డ తర్వాత వారం పది రోజులకే కోలుకుని ఇంటికి వెళ్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బాధితులు కోలుకోవడం వేగంగా జరుగుతోంది. గుంటూరు జిల్లాలో 319 మంది బాధితుల్లో ఇప్పటి వరకు 115 మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఈ 115 మందిలో 40 మంది వారం నుంచి పది రోజుల్లోనే […]

వారం పది రోజులకే కోలుకుంటున్న యూత్‌
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఈ పరిణామం బాధితులతో పాటు ప్రభుత్వానికి, వైద్యులకు పెద్ద ఊరటగా ఉంటోంది. ఆరోగ్యంగా ఉన్న యువకులు కరోనా బారిన పడ్డ తర్వాత వారం పది రోజులకే కోలుకుని ఇంటికి వెళ్తున్నారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బాధితులు కోలుకోవడం వేగంగా జరుగుతోంది. గుంటూరు జిల్లాలో 319 మంది బాధితుల్లో ఇప్పటి వరకు 115 మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఈ 115 మందిలో 40 మంది వారం నుంచి పది రోజుల్లోనే పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌కు మారారు. మరో 30 మంది 12 నుంచి 13 రోజుల్లో కోలుకుంటున్నట్టు వైద్యులు వివరించారు.

మరో 20 మంది కోలుకోవడానికి మాత్రం 13 రోజుల నుంచి 25 రోజులు పట్టింది. కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్న వారిలో వృద్ధులు, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు ఉంటున్నారు.

తక్కువ సమయంలోనే చాలా మంది కరోనా నుంచి కోలుకోవడానికి కారణం… వైరస్‌ సోకిన తొలి నాళ్లలోనే గుర్తించి సరైన వైద్యం అందించడమే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

భారీగా పరీక్షలు చేస్తుండడం వల్ల వైరస్‌ సోకిన వారిని వెంటనే గుర్తించి త్వరగా వైద్యం అందించడం వల్ల త్వరగా కోలుకోవడం సాధ్యమవుతోందని వైద్యులు చెబుతున్నారు. చాలా మందిలో ఒకసారి కరోనాతో ఆస్పత్రికి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తామో అన్న భయం కూడా ఉందని… కానీ అది నిజం కాదని వైద్యులు ధైర్యం చెబుతున్నారు. ఎంత త్వరగా పరీక్షలు చేయించుకుంటే అంత త్వరగా కోలుకునేందుకు వీలవుతుందని చెబుతున్నారు.

పరీక్షలు చేయించుకుని త్వరగా వైరస్‌ను గుర్తించగలిగితే… వయసు మీద పడిన వారు కూడా కరోనాను జయించడం సులువేనని గుంటూరు జిల్లా వైద్యులు చెబుతున్నారు.

First Published:  4 May 2020 4:58 AM IST
Next Story