Telugu Global
Cinema & Entertainment

అర్ఆర్ఆర్ నుంచి మరో రూమర్

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రూమర్స్ కొత్తకాదు. మినిమం గ్యాప్స్ లో ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరి నుంచి కూడా తప్పిస్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో పుకారు పుట్టుకొచ్చింది. ఈసారి చరణ్, తారక్ క్యారక్టర్లకు సంబంధించి కొత్త న్యూస్ వినిపిస్తోంది. సినిమాలో చరణ్ ఎలా ఉంటాడనే విషయంపై ఇప్పటికే అందరికీ ఓ ఐడియా వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా […]

RRR Motion Poster
X

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రూమర్స్ కొత్తకాదు. మినిమం గ్యాప్స్ లో ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరి నుంచి కూడా తప్పిస్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో పుకారు పుట్టుకొచ్చింది. ఈసారి చరణ్, తారక్ క్యారక్టర్లకు సంబంధించి కొత్త న్యూస్ వినిపిస్తోంది.

సినిమాలో చరణ్ ఎలా ఉంటాడనే విషయంపై ఇప్పటికే అందరికీ ఓ ఐడియా వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ లో అతడి లుక్, క్యారెక్టర్ ఏంటనేది తెలిసిందే. త్వరలోనే తారక్ టీజర్ కూడా రాబోతోంది. సరిగ్గా ఇక్కడే గాసిప్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో తారక్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడట.

అవును.. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇందులో ఒక షేడ్ లో మాత్రమే ఎన్టీఆర్ తెలంగాణ యాసలో మాట్లాడతాడట. మరో షేడ్ ఏంటనేది క్లైమాక్స్ లో రివీల్ అవుతుందట. సినిమాకు సంబంధించి వచ్చిన ఎన్నో పుకార్లలో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుందా.. లేక నిజంగానే ఎన్టీఆర్ 2 షేడ్స్ లో కనిపిస్తాడా అనేది త్వరలోనే తెలుస్తుంది.

First Published:  3 May 2020 12:30 PM IST
Next Story