కరోనా ఇప్పట్లో పోదు... భారీగా పరీక్షలతోనే వ్యాప్తిని అడ్డుకోగలం " కేజ్రీవాల్
కరోనా వైరస్‌పై ప్రపంచం ఒక అంచనాకు వస్తోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా వాక్సిన్ వచ్చే వరకు కరోనా పూర్తిగా మాయం అవడం సాధ్యంకాదని ఒక నిర్థారణకు అందరూ వస్తున్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కరోనా ఇప్పట్లో పోదు… దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇటీవల చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం […]
కరోనా వైరస్‌పై ప్రపంచం ఒక అంచనాకు వస్తోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా వాక్సిన్ వచ్చే వరకు కరోనా పూర్తిగా మాయం అవడం సాధ్యంకాదని ఒక నిర్థారణకు అందరూ వస్తున్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
కరోనా ఇప్పట్లో పోదు… దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధులు వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇటీవల చెప్పారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వల్ల కరోనా వైరస్ పోదని అభిప్రాయపడ్డారు. వైరస్ మరింతకాలం మనతోనే ఉండే పరిస్థితి ఉందన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాల్సిన అవసరం ఉందని… ఆ దిశగా ఢిల్లీ ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు.
కరోనా పరీక్షలు అధికంగా చేయడం వల్ల వైరస్ విస్తరించకుండా అడ్డుకోవచ్చని… అందుకే తాము జోన్లతో సంబంధం లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని కేజ్రీవాల్ వివరించారు. జిల్లాలకు జిల్లాలు మొత్తం రెడ్‌జోన్ లుగా కాకుండా.. కేవలం కంటైన్‌మెంట్ జోన్లను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ప్రస్తుతం దేశంలో 12వేల 296 కరోనా కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 5వేల 54 కరోనా పాజిటివ్ కేసులు గుజరాత్‌లో నమోదయ్యాయి. 4వేల 122 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.