Telugu Global
Cinema & Entertainment

హరీష్ శంకర్-చిరంజీవి కాంబినేషన్

చాలామంది దర్శకులకు ఇచ్చినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి తనకు కూడా మాటిచ్చారంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. చిరంజీవి కోసం రౌడీ అల్లుడు టైపులో ఓ మాస్ కథ రెడీ చేస్తానంటున్నాడు. చిరంజీవిని డైరక్ట్ చేయడాన్ని తన జీవితాశయంగా చెప్పుకొచ్చిన ఈ దర్శకుడు.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు “పవర్ స్టార్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. అలాగే మెగాస్టార్ సినిమా కూడా వుంటుంది. రౌడీ అల్లుడు లాంటి ఎంటర్ టైనర్ చేయాలని ప్రయత్నం. అలాగే చరణ్ తో […]

హరీష్ శంకర్-చిరంజీవి కాంబినేషన్
X

చాలామంది దర్శకులకు ఇచ్చినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి తనకు కూడా మాటిచ్చారంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. చిరంజీవి కోసం రౌడీ అల్లుడు టైపులో ఓ మాస్ కథ రెడీ చేస్తానంటున్నాడు. చిరంజీవిని డైరక్ట్ చేయడాన్ని తన జీవితాశయంగా చెప్పుకొచ్చిన ఈ దర్శకుడు.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు

“పవర్ స్టార్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. అలాగే మెగాస్టార్ సినిమా కూడా వుంటుంది. రౌడీ అల్లుడు లాంటి ఎంటర్ టైనర్ చేయాలని ప్రయత్నం. అలాగే చరణ్ తో కూడా చేసేస్తే మొత్తం మెగా హీరోలను కవర్ చేసిన సంతృప్తి వచ్చేస్తుంది. చిరంజీవిని డైరక్ట్ చేయాలనేది నా లైఫ్ యాంబిషన్.”

ఇలా చిరంజీవితో సినిమాపై రియాక్ట్ అయ్యాడు హరీష్ శంకర్. ఈ దర్శకుడు ఇప్పటికే పవన్, బన్నీ, వరుణ్ తేజ్ తో సినిమాలు తీశాడు. రామ్ చరణ్, చిరంజీవిని కూడా కవర్ చేస్తే మెగా కాంపౌండ్ లో హీరోలందరితో సినిమా తీసిన దర్శకుడిగా రికార్డు సృష్టించిన వాడవుతాడు హరీష్. ప్రస్తుతం ఆ దిశగానే ప్రయత్నిస్తున్నానంటున్నాడు ఈ డైరక్టర్.

First Published:  3 May 2020 11:30 AM IST
Next Story