Telugu Global
National

లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు రెడీగా ఉన్నాము...

ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు రెడీగా ఉన్నామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. పరిశ్రమలు, సేవా రంగంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. కరోనాతో జీవించేందుకు రెడీ కావాలి…. ఢిల్లీని రీ ఓపెన్‌ చేయాల్సిన సమయం వచ్చిందని కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీలో ఇప్పటివరకూ 4,122 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 1,256 మంది రికవరీ అయ్యారు. 64 మంది చనిపోయారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లను సీజ్‌ చేయమని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నామని…గ్రీన్‌ జోన్‌లో కార్యకలాపాలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని కేజ్రీవాల్‌ […]

లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు రెడీగా ఉన్నాము...
X

ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు రెడీగా ఉన్నామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. పరిశ్రమలు, సేవా రంగంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. కరోనాతో జీవించేందుకు రెడీ కావాలి…. ఢిల్లీని రీ ఓపెన్‌ చేయాల్సిన సమయం వచ్చిందని కేజ్రీవాల్‌ అన్నారు.

ఢిల్లీలో ఇప్పటివరకూ 4,122 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 1,256 మంది రికవరీ అయ్యారు. 64 మంది చనిపోయారు.

కంటైన్‌మెంట్‌ జోన్‌లను సీజ్‌ చేయమని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నామని…గ్రీన్‌ జోన్‌లో కార్యకలాపాలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని కేజ్రీవాల్‌ అన్నారు.

సరి-బేసి పద్ధతిలో షాపులు కూడా తెరిచే వీలు కల్పించాలని చెప్పారు. ఒక వేళ కేసులు పెరిగినా పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

నిత్యావసరాల కోసం ఈ-కామర్స్‌, ఐటీ, కాల్‌ సెంటర్స్‌తో పాటు ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు నడుస్తున్నాయని కేజ్రీవాల్‌ చెప్పారు.

పెద్దపెద్ద మార్కెట్లు మూసివేసి ఉంచుతామని తెలిపారు. టెక్నిషియన్స్‌, ప్లంబర్స్‌ తమ పనులు‌ చేసుకునేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం నడవదు… ప్రైవేటు వాహనాలు‌ నడిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

వృద్ధులు, గర్బిణీలు, బీపీ, డయాబెటిక్‌తో బాధపడేవారు బయటకు రావొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సూచించారు.

First Published:  3 May 2020 3:36 PM IST
Next Story