Telugu Global
National

మద్యం విక్రయాలకు అనుమతి... ప్రజా రవాణాపై కొనసాగనున్న నిషేధం

కేంద్ర ప్రభుత్వం మూడో విడత లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సారి మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ సారి లాక్‌డౌన్‌‌లో పలు సడలింపులు ప్రకటించారు. రెడ్ జోన్లలో నిబంధనలు కఠినంగానే ఉండనున్నాయి. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యాకలాపాలకు అనుమతి ఇచ్చారు. లాక్‌డౌన్ కాలంలో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ చేశారు. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం […]

మద్యం విక్రయాలకు అనుమతి... ప్రజా రవాణాపై కొనసాగనున్న నిషేధం
X

కేంద్ర ప్రభుత్వం మూడో విడత లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సారి మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ సారి లాక్‌డౌన్‌‌లో పలు సడలింపులు ప్రకటించారు. రెడ్ జోన్లలో నిబంధనలు కఠినంగానే ఉండనున్నాయి. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యాకలాపాలకు అనుమతి ఇచ్చారు.

లాక్‌డౌన్ కాలంలో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్ చేశారు. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. మద్యం దుకాణాల వద్ద ఒకే సారి ఐదుగురికి మించి ఉండరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంతే కాకుండా మద్యం, పాన్, గుట్కా దుకాణాల వద్ద అందరూ 6 అడుగుల మేర దూరం పాటించాలని స్పష్టం చేసింది. కాని బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గుట్కా, పాన్ వాడకాన్ని నిషేధించింది.

ఇక బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, ఫంక్షన్ హాళ్లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం అధికారుల వద్ద నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని.. కేవలం 50 మంది అతిథులు భౌతిక దూరం పాటిస్తూ జరుపుకోవాలని కేంద్రం చెప్పింది.

అన్ని జోన్లలో రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు, విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగనుంది. సైకిల్, ఆటో రిక్షా, ట్యాక్సీ క్యాబ్‌లు తిరగరాదని చెప్పింది. అయితే డ్రైవర్‌ కాకుండా మరో ఇద్దరు ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్ళేలా క్యాబ్‌లకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇక సెలూన్లు, స్పా, బార్బర్ షాపులు తెరవరాదని.. విద్యాసంస్థలు కూడా మూసే ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్రాల బస్సు సర్వీసులు కూడా నడపవద్దని కేంద్రం ఆదేశించింది.

First Published:  1 May 2020 8:04 PM GMT
Next Story