సీఆర్‌పీఎఫ్‌కు కరోనా టెన్షన్... 2 వారాల్లో 122 కేసులు !
కరోనా.. ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా ఈవైరస్ పేరు చెబితే తెగ భయపడుతున్నారు. ఢిల్లీలోని బెటాలియన్‌లో 122 మంది జవాన్లకు ఈ వైరస్ సోకింది. ఈ మహమ్మారి దెబ్బకు అసోంకు చెందిన 55 ఏళ్ల జవాన్ వైరస్‌తో మృతిచెందారు. ఇంకా 100 మంది టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉంది. 31వ బెటాలియన్ కు చెందిన వారికి వైరస్ ఎక్కువగా సోకింది. దీంతో ఢిల్లీ మయూర్ విహార్ ఫేస్ -3లోని బెటాలియన్ ను […]
కరోనా.. ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా ఈవైరస్ పేరు చెబితే తెగ భయపడుతున్నారు. ఢిల్లీలోని బెటాలియన్‌లో 122 మంది జవాన్లకు ఈ వైరస్ సోకింది. ఈ మహమ్మారి దెబ్బకు అసోంకు చెందిన 55 ఏళ్ల జవాన్ వైరస్‌తో మృతిచెందారు. ఇంకా 100 మంది టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉంది.
31వ బెటాలియన్ కు చెందిన వారికి వైరస్ ఎక్కువగా సోకింది. దీంతో ఢిల్లీ మయూర్ విహార్ ఫేస్ -3లోని బెటాలియన్ ను పూర్తిగా సీజ్ చేశారు. ఈ నెల మొదట్లో సీఆర్‌పీఎఫ్‌లోని నర్సింగ్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అక్కడి నుంచి జవాన్లకు వైరస్ సోకిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ బెటాలియన్‌లో మొత్తం వెయ్యి మంది ఉన్నారు. దీంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఉన్నతాధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన జవాన్లను కూడా క్వారంటైన్‌కు తరలించారు.
దేశంలో ఇవాళ ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. ఉదయం 2,293 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 37,336కి చేరింది. 1,218 మంది మృతిచెందారు. ఢిల్లీలో 3,738 కరోనా బాధితులు ఉన్నారు. వీరిలో 61 మంది చనిపోయారు.