వైఎస్ జగన్ పెద్ద మనసు... వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల సాయం
ఏపీలో పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లాలనే లక్ష్యంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయడంలో, మర్కజ్ బాధితులను గుర్తించడంలో వాలంటీర్ల కృషిని జగన్ పలుమార్లు ప్రశంసించారు. వాలంటీర్లకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ క్రమంలో అకాలమరణం పొందిన ఒక వాలంటీర్ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు మండలం తుంపాడ గ్రామ […]
ఏపీలో పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లాలనే లక్ష్యంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయడంలో, మర్కజ్ బాధితులను గుర్తించడంలో వాలంటీర్ల కృషిని జగన్ పలుమార్లు ప్రశంసించారు. వాలంటీర్లకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ క్రమంలో అకాలమరణం పొందిన ఒక వాలంటీర్ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయంలో గబ్బాడ అనురాధ (26) వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల ఆమె కుజ్జెలి పంచాయితీలో పింఛన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. ఆమె మరణ వార్తను పత్రికల ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే సీఎంవో అధికారులతో పూర్తి వివరాలు తెప్పించుకున్నారు.
మరణించిన అనురాధ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా, రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. విశాఖపట్నం కలెక్టర్‌కు వెంటనే ఫోన్ చేసి బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కరోనా విపత్తు సమయంలో ఎంతో కష్టపడుతున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని వైఎస్ జగన్ చెప్పారు. కరోనా వైరస్‌కు భయపడకుండా మారు మూల గ్రామాల్లో సేవచేస్తున్న వాలంటీర్లకు తాను ఉన్నానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
విశాఖ ఏజెన్సీలో పెన్షన్లు పంపిణీచేస్తూ గుండెపోటుతో మరణించిన గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప్రకటించారు.
విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 2, 2020