వైజాగ్... వైద్యురాలికి పూలతో స్వాగతం పలికిన అపార్ట్‌మెంట్ వాసులు
కరోనా ఎవరికైనా రావొచ్చు. కానీ చాలా మంది కరోనాతో కాకుండా కరోనా రోగులపై పోరాటానికి దిగుతున్నారు. వైద్యులపైనా దాడులకు దిగుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యుల ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేస్తుంటే వారిని అభినందించాల్సింది పోయి కొన్నిచోట్ల వారిని అపార్ట్‌మెంట్లలోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దాంతో ప్రభుత్వమే కఠిన చట్టాలను ప్రయోగిస్తోంది. డాక్టర్లపై దాడులు చేసినా, వారిని అపార్ట్‌మెంట్లలో గానీ, ఇంటి ఓనర్లు గానీ అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే […]
కరోనా ఎవరికైనా రావొచ్చు. కానీ చాలా మంది కరోనాతో కాకుండా కరోనా రోగులపై పోరాటానికి దిగుతున్నారు. వైద్యులపైనా దాడులకు దిగుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యుల ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేస్తుంటే వారిని అభినందించాల్సింది పోయి కొన్నిచోట్ల వారిని అపార్ట్‌మెంట్లలోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
దాంతో ప్రభుత్వమే కఠిన చట్టాలను ప్రయోగిస్తోంది. డాక్టర్లపై దాడులు చేసినా, వారిని అపార్ట్‌మెంట్లలో గానీ, ఇంటి ఓనర్లు గానీ అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే విశాఖపట్నంలో మాత్రం అపార్ట్‌మెంట్ వాసులు గొప్పతనాన్ని చాటుకున్నారు.
మధురవాడ సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ వాసులు ఒక డాక్టర్‌కు పూలతో స్వాగతం పలికారు. 14 రోజుల పాటు కరోనా ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహించి వచ్చిన మహిళా డాక్టర్‌కు అపార్ట్‌మెంట్ వాసులు పూలతో స్వాగతం పలికారు. చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే స్పూర్తిని అందరూ ప్రదర్శించాలన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
పద్నాలుగు రోజుల పాటు కోవిడ్ ఎపెక్టెడ్ ఏరియాలో పని చేసి ఇంటికి వచ్చిన డాక్టర్ ను పూల వర్షంతో అభినందించిన వైజాగ్ మధురవాడ సాయి రెసిడెన్సి అపార్ట్ మెంట్ వాసులకు శతకోటి వందనాలు….
Publiée par Satheesh Grandhi sur Jeudi 30 avril 2020