తెలుగు రాష్ట్రాల్లో ఏయే జిల్లాలు ఏ జోన్లో..?
దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల పేరుతో పిలిచే ఈ జోన్లను గతంలో నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా విభజించారు. ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించడం వల్ల అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏ నిబంధనలు అమలు చేయాలనే విషయంపై అధికారులకు కూడా ఒక స్పష్టత వస్తుంది. కాగా ప్రస్తుతం ఈ జోన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు […]
దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల పేరుతో పిలిచే ఈ జోన్లను గతంలో నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా విభజించారు. ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించడం వల్ల అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏ నిబంధనలు అమలు చేయాలనే విషయంపై అధికారులకు కూడా ఒక స్పష్టత వస్తుంది.
కాగా ప్రస్తుతం ఈ జోన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్ జోన్‌లో, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నట్లు హోం శాఖ వెల్లడించింది. కాగా, యూపీలో అత్యధికంగా 19 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.
ఏపీలో ఏ జిల్లా ఏ జోన్‌లో..
రెడ్ జోన్ (5) : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
ఆరెంజ్ జోన్ (7) : తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం
గ్రీన్ జోన్ (1) : విజయనగరం
తెలంగాణ
రెడ్ జోన్ (6) : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్ (18) : నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, అదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల
గ్రీన్ జోన్ (9) : పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి