Telugu Global
NEWS

ఒకరిది జూమ్‌... ఇంకొకరిది ట్వీట్‌... బాబు, లోకేష్ లపై బుగ్గన సెటైర్లు

లాక్‌డౌన్‌తో పేదలు అల్లాడుతుంటే… ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 6 వేల కోట్లుకు పైగా డబ్బులు చెల్లించిందని టీడీపీ నేత నారా లోకేష్‌ చేసిన ఆరోపణలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. ఒకరు జూమ్‌ తండ్రి …ఇంకొరు ట్వీట్‌ కొడుకు అంటూ సెటైర్లు విసిరారు. గత ఏడాది కంటే 30 వేల కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చిందని… కానీ ప్రభుత్వం మాత్రం డాక్టర్లకు ఇచ్చే మాస్క్‌లు, ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతున్నారని లోకేష్‌ […]

ఒకరిది జూమ్‌... ఇంకొకరిది ట్వీట్‌... బాబు, లోకేష్ లపై బుగ్గన సెటైర్లు
X

లాక్‌డౌన్‌తో పేదలు అల్లాడుతుంటే… ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 6 వేల కోట్లుకు పైగా డబ్బులు చెల్లించిందని టీడీపీ నేత నారా లోకేష్‌ చేసిన ఆరోపణలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. ఒకరు జూమ్‌ తండ్రి …ఇంకొరు ట్వీట్‌ కొడుకు అంటూ సెటైర్లు విసిరారు.

గత ఏడాది కంటే 30 వేల కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చిందని… కానీ ప్రభుత్వం మాత్రం డాక్టర్లకు ఇచ్చే మాస్క్‌లు, ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతున్నారని లోకేష్‌ విమర్శించారు.

అయితే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్‌ కొన్ని విషయాలు తెలుసుకోవాలని బుగ్గన సూచించారు.

ఒకే అంశంపై లోకేష్ కు‌ పొద్దున ఒక ట్వీట్‌… మధ్యాహ్నం ఓ ట్వీట్‌…. సాయంత్రం ఓ ట్వీట్‌ చేయడం అలవాటుగా మారిందని దెప్పిపొడిచారు. ఏప్రిల్‌ 4న ఉదయం 11.40 నిమిషాలకు ఒక ట్వీట్‌… సాయంత్రం 4.40 నిమిషాలకు అదే ట్వీట్‌… మళ్లీ రాత్రి అదే అంశంపై ట్వీట్‌ చేశారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి టీడీపీ నేతలకు అవగాహన లేదని విమర్శించారు.

2018-19లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. లక్షా 64 వేల 841 కోట్ల రూపాయలు. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి వచ్చిన ఆదాయం దాదాపు లక్షా 70 వేల కోట్లు. గత ఏడాది కంటే ఐదు వేల కోట్లు మాత్రమే ఎక్కువ ఆదాయం వచ్చిందని… లోకేష్‌ చెప్పినట్లు 30 వేల కోట్లు రాలేదని బుగ్గన వివరించారు.

యనమల రామకృష్ణుడు వచ్చి ఈ ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదు… ఆదాయం తెచ్చుకోవడం లేదని విమర్శిస్తే… లోకేష్‌ 30 వేల కోట్ల ఎక్కువ ఆదాయం వచ్చిందని ట్వీట్లు చేస్తున్నాడని బుగ్గన అన్నారు. తెలుగుదేశం నేతల్లోనే ఓ క్లారిటీ లేదని అన్నారు.

మార్చి 30, 31 న ప్రభుత్వం చెల్లించిన 6,400 కోట్ల రూపాయల వివరాలు కూడా బుగ్గన చెప్పారు .

  • పేదవాళ్ల ఇళ్ల పట్టాల కోసం – 1,505 కోట్లు
  • ఫించన్లు – 1,380 కోట్లు
  • వర్క్స్‌ బిల్లు – 844 కోట్లు
  • గ్రాండ్‌ ఇన్‌ ఎయిడ్‌ – 591 కోట్లు
  • ఏపీ జెన్‌కో – 578 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన – 510 కోట్లు
  • ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ పెండింగ్‌ బిల్లులు – 324 కోట్లు
  • నా బార్డు, అప్పులు తిరిగి చెల్లింపు – 271 కోట్లు
  • సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల డైట్‌ చార్జీలు- 132 కోట్లు
  • 108, 104, పోలీసు వాహనాల కోసం – 126 కోట్లు
  • ఐటీ డిడక్షన్‌ – 102 కోట్లు
  • అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులకు – 50 కోట్లు
  • డీఏ – 27 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ – 26కోట్లు

ఈ మొత్తం 6,400 కోట్ల రూపాయల్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది కేవలం 724 కోట్లు మాత్రమేనని బుగ్గన చెప్పారు. అందులో ఎక్కువ శాతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

First Published:  1 May 2020 9:44 AM IST
Next Story