బాలకృష్ణను బోయపాటి ఎలా ఒప్పిస్తాడంటే.....
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో 2 బ్లాక్ బస్టర్లు వచ్చాయి. సింహా, లెజెండ్ రూపంలో బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు బోయపాటి. అసలు వీళ్లిద్దరి మధ్య అంత సింక్ ఎలా కుదిరింది? ఏం చెప్పి బాలయ్యను బోయపాటి ఒప్పిస్తాడు? ఈ విషయంపై బోయపాటి స్వయంగా స్పందించాడు. “అంతా బాలయ్య బాబును కలిసినప్పుడు కథ చెబుతారు. కేవలం కథపైనే ఫోకస్ పెడతారు. నేను కథతో పాటు బాలయ్య బాడీలాంగ్వేజ్ పై దృష్టి పెడతాను. అది ఆయనకు బాగా […]
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో 2 బ్లాక్ బస్టర్లు వచ్చాయి. సింహా, లెజెండ్ రూపంలో బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు బోయపాటి. అసలు వీళ్లిద్దరి మధ్య అంత సింక్ ఎలా కుదిరింది? ఏం చెప్పి బాలయ్యను బోయపాటి ఒప్పిస్తాడు? ఈ విషయంపై బోయపాటి స్వయంగా స్పందించాడు.
“అంతా బాలయ్య బాబును కలిసినప్పుడు కథ చెబుతారు. కేవలం కథపైనే ఫోకస్ పెడతారు. నేను కథతో పాటు బాలయ్య బాడీలాంగ్వేజ్ పై దృష్టి పెడతాను. అది ఆయనకు బాగా నచ్చుతుంది. సింహా, లెజెండ్ లో డైలాగ్స్ చూస్తే.. ఏదో బయట నుంచి తీసుకొచ్చి పెట్టినట్టు ఉండదు. ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి పుట్టుకొచ్చిన డైలాగ్స్ అవి.”
ఇలా బాలయ్యతో తను వర్క్ చేసే విధానం గురించి చెప్పుకొచ్చాడు బోయపాటి. మొదటి సినిమా సింహా కోసం బాలయ్యను ఒప్పించడానికి తనకు కేవలం 20 నిమిషాల టైమ్ మాత్రమే పట్టిందంటున్నాడు బోయపాటి.
“సింహా కథ చెప్పడానికి ముందు నేను విజయవాడలో ఉన్నాను. ఫోన్ చేసి రమ్మంటే, మరుసటి రోజు వెళ్లాను. కథ చెప్పడం కంటే ముందు బాలయ్య క్యారెక్టరైజేషన్ చెప్పాను. సరిగ్గా 20 నిమిషాల్లో మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. కథ కూడా పూర్తిగా వినలేదు. దర్శకుడ్ని అంతలా నమ్ముతారు బాలయ్య.”
తన సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయాన్ని సెట్స్ పైనే బాలయ్య గ్రహిస్తారని అంటున్నాడు బోయపాటి. సగం షూటింగ్ పూర్తయిన వెంటనే తన సినిమా హిట్టవుతుందా పోతుందా అనే విషయం బాలయ్యకు తెలిసిపోతుందంటున్నాడు.