Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

బాలీవుడ్ విలక్షణ నటుడు.. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఇర్ఫాన్ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. క్యాన్సర్ తో కొద్దిరోజులుగా పోరాడుతున్న అతడు నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్ పెద్దపేగు వ్యాధి తో కొద్దికాలంగా పోరాడుతున్నారు. 2018లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి కూడా ఇర్ఫాన్ ఖాన్ కు సోకింది. దీంతో లండన్ […]

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి
X

బాలీవుడ్ విలక్షణ నటుడు.. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఇర్ఫాన్ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. క్యాన్సర్ తో కొద్దిరోజులుగా పోరాడుతున్న అతడు నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ఇర్ఫాన్ ఖాన్ పెద్దపేగు వ్యాధి తో కొద్దికాలంగా పోరాడుతున్నారు. 2018లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి కూడా ఇర్ఫాన్ ఖాన్ కు సోకింది. దీంతో లండన్ లో దీనికి చికిత్స తీసుకున్నాడు.

ఇక మూడు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదాబేగం అనారోగ్యంతో జైపూర్ లో మృతిచెందింది. లాక్ డౌన్ తో తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ ఖాన్ హాజరు కాలేదు.

తాజాగా నిన్న సాయంత్రం ఇర్ఫాన్ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఈరోజు మరణించారు. ఇర్పాన్ ఖాన్ పలు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి పాపులర్ అయ్యారు. ఇతడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు.

First Published:  29 April 2020 8:34 AM IST
Next Story