రాంచరణ్ సలహాను పాటిస్తున్న చిరు... ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఉగాది శుభ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఘనంగా అడుగుపెట్టాడు. ప్రస్తుతం దానిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు. ఇన్నాళ్లు చిరంజీవి భావాలు.. అభిమానులకు ఏదైనా మెసేజ్ ఇద్దామంటే కష్టంగా ఉండేది. ఆయన విలేకరుల సమావేశం పెట్టి పంచుకునేవారు. ఇదో పెద్ద పని. అదే సోషల్ మీడియా ద్వారా అయితే చిన్న మెసేజ్ లు, వీడియోలతో అందరికీ ఈ సమాచారం క్షణాల్లో వెళ్లిపోతోంది. ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. తన అభిమానులతో సంభాషిస్తున్నాడు. […]
మెగాస్టార్ చిరంజీవి ఈ ఉగాది శుభ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఘనంగా అడుగుపెట్టాడు. ప్రస్తుతం దానిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.
ఇన్నాళ్లు చిరంజీవి భావాలు.. అభిమానులకు ఏదైనా మెసేజ్ ఇద్దామంటే కష్టంగా ఉండేది. ఆయన విలేకరుల సమావేశం పెట్టి పంచుకునేవారు. ఇదో పెద్ద పని. అదే సోషల్ మీడియా ద్వారా అయితే చిన్న మెసేజ్ లు, వీడియోలతో అందరికీ ఈ సమాచారం క్షణాల్లో వెళ్లిపోతోంది.
ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. తన అభిమానులతో సంభాషిస్తున్నాడు. తన తోటి నటులను ఉత్తేజపరిచే వ్యాక్యలతో పలకరిస్తున్నాడు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తన సోషల్ మీడియా ఎంట్రీ గురించి కొన్ని లోతైన విషయాలను చెప్పుకొచ్చాడు. తన అభిప్రాయాలను తన అభిమానులతో చాలా సార్లు పంచుకోవాలని అనిపించినా అప్పటికప్పుడు అలా చేయలేకపోయానని.. చాలా మథన పడ్డానని తెలిపారు.
దిశా, నిర్భయ సంఘటనల సమయంలో చిరంజీవి స్పందించాలని అనుకున్నా సరైన వేదిక లేకుండా పోయిందన్నాడు. ఆ సమయంలో తన కుమారుడు రాంచరణ్ విలువైన సలహా ఇచ్చాడని.. సోషల్ మీడియాలోకి తనను తీసుకొచ్చాడని వివరించాడు.
తనకు మొదట్లో సోషల్ మీడియా గురించి తెలియదని.. చరణ్ సలహా ఇచ్చిన తరువాత ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాని చిరంజీవి వివరించాడు.