నెల్లూరులో రోబో కరోనా సేవలు
కరోనా బారిన పడిన వారికి సేవలందించేందుకు నెల్లూరులో రోబోను వాడుతున్నారు. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఈ రోబో పనిచేస్తుంది. దీన్ని నెల్లూరుకు చెందిన మాజిన్ గ్రూప్స్, ఆదాల ప్రభాకర్ రెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు నిజాయుద్ధీన్… ఇంజినీర్ పర్వేజ్‌తో కలిసి తయారు చేశారు. వారం వ్యవధిలోనే దీన్ని తయారు చేసినట్టు ఇంజినీర్ పర్వేజ్ చెప్పారు. ఈ రోబోను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. దాని పనితీరు పరిశీలించిన కలెక్టర్ రోబోను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి పంపాల్సిందిగా ఆదేశించారు. 25 కిలోల […]
కరోనా బారిన పడిన వారికి సేవలందించేందుకు నెల్లూరులో రోబోను వాడుతున్నారు. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఈ రోబో పనిచేస్తుంది. దీన్ని నెల్లూరుకు చెందిన మాజిన్ గ్రూప్స్, ఆదాల ప్రభాకర్ రెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకుడు నిజాయుద్ధీన్… ఇంజినీర్ పర్వేజ్‌తో కలిసి తయారు చేశారు. వారం వ్యవధిలోనే దీన్ని తయారు చేసినట్టు ఇంజినీర్ పర్వేజ్ చెప్పారు.
ఈ రోబోను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. దాని పనితీరు పరిశీలించిన కలెక్టర్ రోబోను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి పంపాల్సిందిగా ఆదేశించారు. 25 కిలోల బరువు ఉండే ఈ రోబో 40 కిలోల వరకు బరువును మోయగలదని తయారీదారుడు వివరించారు.
ఐసోలేషన్ వార్డులో ఉండే రోగులకు మందులు, ఆహారం వంటి వాటిని దీని ద్వారా సరఫరా చేసేందుకు వీలవతుందని తెలిపారు. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. డాక్టర్ నేరుగా రోగితో మాట్లాడేందుకు వీలుగా ఈ రోబోకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఉంది. ఈ రోబోకు ‘నెల్‌బోట్’ అని పేరు పెట్టారు.