ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు రాజమౌళి గుడ్ న్యూస్...
ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ ట్రైలర్ ‘అల్లూరి సీతరామారాజు’గా రాంచరణ్ ట్రైలర్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే మే 20న కూడా ‘కొమురం భీం’ ట్రైలర్ రిలీజ్ చేద్దామని రాజమౌళి ప్లాన్ చేశాడు. కానీ లాక్ డౌన్ వల్ల సాధ్యం కావడం లేదు. అయితే ఇప్పటివరకు చేసిన షూటింగ్ తాలుకా […]
ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ ట్రైలర్ ‘అల్లూరి సీతరామారాజు’గా రాంచరణ్ ట్రైలర్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు.
అయితే ఎన్టీఆర్ బర్త్ డే మే 20న కూడా ‘కొమురం భీం’ ట్రైలర్ రిలీజ్ చేద్దామని రాజమౌళి ప్లాన్ చేశాడు. కానీ లాక్ డౌన్ వల్ల సాధ్యం కావడం లేదు. అయితే ఇప్పటివరకు చేసిన షూటింగ్ తాలుకా కొమురం భీం ఎన్టీఆర్ స్టిల్స్ ను తాజాగా ఎడిటింగ్ చేస్తున్నారట.. ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ షూట్ లోనే దీన్ని ఎడిట్ చేస్తున్నాడట.. అవుట్ పుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
దీంతో మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆయన ఫ్యాన్స్ కు రాజమౌళి బర్త్ డే గిఫ్ట్ గా ‘కొమురం భీం’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొమురం భీంకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ను ఎడిటర్ తమ్మిరాజు పూర్తి చేశాడట.. ఇది బాగా వచ్చిందని రాజమౌళి కూడా యాక్సెప్ట్ చేశాడట.. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ వార్త తెలిసి ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈ ట్రైలర్ లో తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగులు చాలా కొత్తగా ఉంటాయట.. ఈ సినిమాకు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగులు రాశాడట.. అవి ఎన్టీఆర్ పలికిన తీరు.. అందరినీ మెప్పిస్తుందని అంటున్నారు. దీంతో మే 20 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.