లాక్ డౌన్ టైమ్ లో ఈమె మాత్రం హ్యాపీ
లాక్ డౌన్ టైమ్ లో సినిమాల్లేక ఆర్టిస్టులంతా ఇబ్బంది పడుతున్నారు. ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయలేక మరికొంతమంది హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు. అగ్రిమెంట్ల మీద సంతకాలు జరగక, అసలు అవకాశం వస్తుందా పోతుందా అనే భయంలో మరికొందరు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో కూడా హ్యాపీగా ఉంది హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమె ఇంత సంతోషంగా ఉండడానికి ఓ కారణం ఉంది. సరిగ్గా లాక్ డౌన్ కు ముందు ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసుకుంది. […]
లాక్ డౌన్ టైమ్ లో సినిమాల్లేక ఆర్టిస్టులంతా ఇబ్బంది పడుతున్నారు. ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయలేక మరికొంతమంది హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు. అగ్రిమెంట్ల మీద సంతకాలు జరగక, అసలు అవకాశం వస్తుందా పోతుందా అనే భయంలో మరికొందరు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో కూడా హ్యాపీగా ఉంది హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.
ఈమె ఇంత సంతోషంగా ఉండడానికి ఓ కారణం ఉంది. సరిగ్గా లాక్ డౌన్ కు ముందు ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసుకుంది. మిసెస్ సీరియల్ కిల్లర్ పేరుతో తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్, ఈ లాక్ డౌన్ టైమ్ లో విడుదలకు సిద్ధమౌతోంది. హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమైన వేళ.. తను నటించిన సిరీస్ పై అందరూ దృష్టిపెట్టడంతో హ్యాపీగా ఫీలవుతోంది జాక్వెలిన్. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కేవలం తన గురించి మాత్రమే మాట్లాడుకోవడం థ్రిల్లింగ్ గా ఉందని చెబుతోంది.
నిజానికి ఇండస్ట్రీ రన్నింగ్ లో ఉంటే జాక్వెలిన్ ను ఎవ్వరూ పట్టించుకోరు. అంతా కత్రినా, కరీనా, అలియా అంటూ వెంటపడతారు. లాక్ డౌన్ కావడం.. హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితం కావడం.. సరిగ్గా ఇదే టైమ్ కు జాక్వెలిన్ వెబ్ సిరీస్ రెడీ అవ్వడంతో.. మీడియా దృష్టి మొత్తం ఈమెపైనే పడింది. ఇలా ఊహించని విధంగా వచ్చిన పబ్లిసిటీతో ఫుల్ హ్యాపీగా ఉంది జాక్వెలిన్. ఈ వెబ్ సిరీస్ తో తన కెరీర్ కొత్త మలుపు తీసుకుంటుందని చెబుతోంది.