Telugu Global
National

కొరియా మోడల్‌ ఫాలో అవుతున్న ఏపీ

కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం అత్యధిక పరీక్షలు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. అయితే తొలుత పరీక్షలు సరిగా చేయలేదని విమర్శించిన ప్రతిపక్షం… ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంపైనా విమర్శలు చేస్తోంది. వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. సోమవారం నాటికి ఏపీలో మొత్తం 74వేల 551 కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 18వేల […]

కొరియా మోడల్‌ ఫాలో అవుతున్న ఏపీ
X

కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం అత్యధిక పరీక్షలు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. అయితే తొలుత పరీక్షలు సరిగా చేయలేదని విమర్శించిన ప్రతిపక్షం… ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంపైనా విమర్శలు చేస్తోంది.

వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. సోమవారం నాటికి ఏపీలో మొత్తం 74వేల 551 కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 18వేల 859 గా ఉంది.

వైరస్ విస్తరణ రేటు కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువగా ఉండడం ప్రభుత్వానికి ఊరటనిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇన్‌ఫెక్షన్ రేటు 8.78 శాతంగా ఉంది. మహారాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్ రేటు 7. 47గా ఉంది. ఏపీలో ఈ రేటు కేవలం 1.58 శాతంగా మాత్రమే ఉంది.

కరోనా కేసులు పెరుగుతున్నాయని భయపడాల్సిన అవసరం లేదని… ఇంతకాలం దాగి ఉన్న కరోనా బాధితులను పరీక్షల ద్వారా గుర్తించి వెలికితీస్తున్నందున ఇది మంచి పరిణామమేనని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోనే సగటున అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ కొరియా అనుభవాలను ప్రస్తావిస్తున్నారు. ఇక్కడి తరహాలో లాక్‌డౌన్‌ లేకుండానే కొరియా కరోనా వైరస్‌ను కట్టడి చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకునే ఏపీలో చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

దక్షిణ కొరియాలో తొలి కేసు జనవరి 19న నమోదు అయింది. నెల తర్వాత ఆ సంఖ్య 30కి చేరింది. ఆ తర్వాత పదిరోజుల్లోనే హఠాత్తుగా కరోనా కేసుల సంఖ్య 2వేల 300కు చేరింది. ఒకే రోజు 800 కేసులు నమోదు అయిన ఉదంతం ఉంది. ఈ పరిస్థితిని దక్షిణ కొరియా ఎదుర్కొనేందుకు వాడిన వ్యూహం అత్యధిక పరీక్షలు నిర్వహించడమే. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ ఉన్న వారందరినీ గుర్తించారు. భారీగా పరీక్షలు నిర్వహిస్తూ కరోనా బారినపడిన వారిని గుర్తించారు.

ఇలా భారీగా పరీక్షలు నిర్వహిస్తూ… కరోనా వచ్చిన వారిని ఐసోలేట్ చేస్తూ వెళ్లడం ద్వారా ఎలాంటి కఠిన లాక్‌డౌన్‌లు లేకుండానే మార్చి నెలాఖరకు కరోనాను అదుపులోకి తీసుకురాగలిగింది. ఇప్పుడు కొరియాలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితం అయిందని ఏపీ నోడల్ ఆఫీసర్‌ జె. సుబ్రమణ్యం వివరించారు.

ఏపీ ప్రభుత్వం కూడా కొరియా తరహాలోనే భారీగా పరీక్షలు నిర్వహిస్తూ కరోనా బాధితులను ఐసోలేట్ చేస్తోందని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రస్తుతానికి కేసుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా… మునుముందు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం ద్వారా మే నెలలో కరోనా ఏపీలో అదుపులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్టు సుబ్రమణ్యం వివరించారు.

First Published:  28 April 2020 5:09 AM IST
Next Story