Telugu Global
NEWS

దేవినేని ఉమా... మొదట ఆడ మగ పరీక్షలు చేయించుకోవడం బెటర్‌ " మంత్రి అనిల్

అత్యధిక పరీక్షలు చేస్తుండడంతో కరోనా కేసులు కొన్ని ఎక్కువగా బయటపడుతున్నాయని మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. 80వేల పరీక్షలు చేస్తే 1,259 కేసులు బయటపడ్డాయన్నారు. 1.5 శాతం మాత్రమే ఇన్ఫెక్షన్ రేటు ఉన్న రాష్ట్రం ఏపీ అని వివరించారు. ఇన్ఫెక్షన్ రేటు దేశంలో 4.5 శాతంగా ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇది 8.5 శాతంగా ఉందన్నారు. మరణాల రేటులోనూ ఏపీ చాలా తక్కువగా ఉందన్నారు. ఇంత మెరుగ్గా ప్రభుత్వం పనిచేస్తుంటే చంద్రబాబునాయుడు పక్కరాష్ట్రంలో దాక్కుని తప్పుడు లేఖలు […]

దేవినేని ఉమా... మొదట ఆడ మగ పరీక్షలు చేయించుకోవడం బెటర్‌  మంత్రి అనిల్
X

అత్యధిక పరీక్షలు చేస్తుండడంతో కరోనా కేసులు కొన్ని ఎక్కువగా బయటపడుతున్నాయని మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. 80వేల పరీక్షలు చేస్తే 1,259 కేసులు బయటపడ్డాయన్నారు. 1.5 శాతం మాత్రమే ఇన్ఫెక్షన్ రేటు ఉన్న రాష్ట్రం ఏపీ అని వివరించారు. ఇన్ఫెక్షన్ రేటు దేశంలో 4.5 శాతంగా ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇది 8.5 శాతంగా ఉందన్నారు.

మరణాల రేటులోనూ ఏపీ చాలా తక్కువగా ఉందన్నారు. ఇంత మెరుగ్గా ప్రభుత్వం పనిచేస్తుంటే చంద్రబాబునాయుడు పక్కరాష్ట్రంలో దాక్కుని తప్పుడు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. రాజ్‌భవన్‌ వరకు కరోనా వెళ్లిందంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారని.. కానీ కరోనాకు రాజు, పేద ఏమీ ఉండదన్నారు. ఎవరికైనా కరోనా రావొచ్చు అని వ్యాఖ్యానించారు.

రాజ్‌భవన్ లో పనిచేసే సిబ్బంది అజాగ్రత్త వల్ల వచ్చి ఉండవచ్చన్నారు. ప్రపంచంలో పలు దేశాధినేతలే కరోనా బారినపడ్డారని గుర్తు చేశారు. ఏపీకి చెందిన ఒక ఎంపీ కుటుంబంలో ఉన్న నలుగురు వైద్యులకు కరోనా వస్తే … దాన్ని కూడా టీడీపీ హేళన చేసి మాట్లాడుతోందని… వారికి వైద్యసేవలు అందించడమే తప్పా అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.

చివరకు కరోనా టెస్ట్‌ కిట్లు తెస్తే దానిపైన కూడా బురద జల్లే నీచస్తాయికి చంద్రబాబునాయుడు దిగజారిపోయారని విమర్శించారు. ముసలివాడు అయిన చంద్రబాబు ఇంట్లో ఉండడాన్ని తామేమీ తప్పుపట్టడం లేదని… ఉన్న వ్యక్తి ఏదో మౌనంగా ఉంటే బాగుంటుందన్నారు. అలా కాకుండా వెదవ చెంచాల చేత చంద్రబాబు విమర్శలు చేయిస్తున్నారని విమర్శించారు. ఇంత కష్టకాలంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న చంద్రబాబుకు ఏపీ ప్రజల గురించి మాట్లాడే హక్కు ఏముందని ప్రశ్నించారు.

రోజుకు ఏడు వేల పరీక్షలు చేస్తుంటే సిగ్గు లేకుండా, బుర్రలేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైద్యం అందిస్తున్న వైద్యులకు దురదృష్టవశాత్తు వైరస్ సోకడం అన్నది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందని… చంద్రబాబు మాత్రం ఏపీలో మాత్రమే జరుగుతున్నట్టు అందరినీ భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

ఒక్క పేదవాడికి ఒక్క పూట కూడా అన్నంపెట్టని టీడీపీ నేతలు… తిన్నది అరగక 12 గంటల దీక్షలు అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మొదట ఆడ మగ పరీక్షలు చేయించుకుంటే బాగుంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సలహా ఇచ్చారు.

First Published:  28 April 2020 7:38 AM IST
Next Story