ఆ మూడు రాష్ట్రాల్లోనే 50 శాతం కేసులు !
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అర్దరాత్రి వరకూ 28వేల 380 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 21 వేల 132 కేసులు యాక్టివ్. 6,363 మంది బాధితులు రికవరీ అయ్యారు. 886 మంది మృతి చెందారు. అయితే 28 వేల కేసుల్లో సగానికి సగం మూడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ…ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. మహారాష్ట్ర – 8068 గుజరాత్ – 3301 ఢిల్లీ – […]
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అర్దరాత్రి వరకూ 28వేల 380 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 21 వేల 132 కేసులు యాక్టివ్. 6,363 మంది బాధితులు రికవరీ అయ్యారు. 886 మంది మృతి చెందారు.
అయితే 28 వేల కేసుల్లో సగానికి సగం మూడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ…ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి.
- మహారాష్ట్ర – 8068
- గుజరాత్ – 3301
- ఢిల్లీ – 2918
ఈ మూడు రాష్ట్రల తర్వాత మధ్యప్రదేశ్ లో 2,168, ఉత్తరప్రదేశ్ లో 1,955, ఆంధ్రప్రదేశ్ లో 1,177, తెలంగాణ లో 1,002 కేసులు నమోదు అయ్యాయి.
ముంబైలో ఐదువేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశ రాజధానితో పాటు ఆర్ధిక రాజధాని కూడా ఈ మహమ్మారితో అల్లాడుతోంది. ఇక్కడ కంటైన్‌మెంట్ సెంటర్లు పెంచారు. లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌పై ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్చించారు. గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్లలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రధాని ఈసమావేశంలో సంకేతాలు పంపారు. అయితే ప్రైవేటు కార్లకు అనుమతి ఇచ్చి… ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం నడిచే అవకాశం లేదని తెలుస్తోంది.
అయితే ఈ మీటింగ్‌లో తొమ్మిది మంది సీఎంలు మాట్లాడితే… లాక్‌డౌన్ మరో నెల పొడిగించాలని కొందరు సీఎంలు కోరారు. మరికొందరు మాత్రం ఆంక్షలు పెట్టి లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తివేయాలని సూచించారు.
అయితే మే 3న మరోసారి చర్చించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. కేసులు లేని…. పది కంటే కేసులు తక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు ఎత్తివేయాలని ప్రధాని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.