ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ లిక్కర్ దందా... కమిట్ అయితే మీ అకౌంట్ ఖాళీ !
లాక్‌డౌన్‌తో మందుబాబులకు కష్టమొచ్చింది. తొలి 20 రోజులు ఓపిక పట్టారు. లాక్‌డౌన్ ఎత్తేస్తారు… మళ్లీ వైన్‌షాపులు ఓపెన్ అవుతాయని అనుకున్నారు. లేకపోతే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ లాక్‌డౌన్ ను పొడిగిస్తారని అనుకున్నారు. ఈ లోపు వైన్‌షాపులు తెరిస్తే మందు పుల్ స్టాక్ పెట్టుకోవాలని చూశారు. కానీ అనుకున్నదొక్కటి…అయిందొక్కటి. లాక్‌డౌన్ గ్యాప్ లేకుండా పొడిగించడంతో మందు కోసం ఇప్పుడు వైన్‌షాపు గల్లీల చుట్టూ తిరుగుతున్నారు మందుబాబులు. ఏ షాపు షెట్టర్ తెరిచి అమ్ముకపోతారా? అంటూ రాత్రి […]
లాక్‌డౌన్‌తో మందుబాబులకు కష్టమొచ్చింది. తొలి 20 రోజులు ఓపిక పట్టారు. లాక్‌డౌన్ ఎత్తేస్తారు… మళ్లీ వైన్‌షాపులు ఓపెన్ అవుతాయని అనుకున్నారు. లేకపోతే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ లాక్‌డౌన్ ను పొడిగిస్తారని అనుకున్నారు. ఈ లోపు వైన్‌షాపులు తెరిస్తే మందు పుల్ స్టాక్ పెట్టుకోవాలని చూశారు. కానీ అనుకున్నదొక్కటి…అయిందొక్కటి.
లాక్‌డౌన్ గ్యాప్ లేకుండా పొడిగించడంతో మందు కోసం ఇప్పుడు వైన్‌షాపు గల్లీల చుట్టూ తిరుగుతున్నారు మందుబాబులు. ఏ షాపు షెట్టర్ తెరిచి అమ్ముకపోతారా? అంటూ రాత్రి 12 గంటల దాకా హైదరాబాద్ సిటీలో రౌండ్లమీద తిరుగుతున్నారు. కానీ లాక్‌డౌన్ ను స్ట్రిక్ గా అమలు చేయడంతో వైన్‌షాపుల దందా నడవడం లేదు. ఇదే అదనుగా పుల్ బాటిల్ మూడు వేలకు తగ్గకుండా బ్లాక్‌లో అమ్మేవారు అమ్ముతున్నారు.
మందుబాబుల వీక్‌నెస్ పసిగట్టిన సైబర్ దొంగలు.. మొన్నటి దాకా గూగుల్‌లో నెంబర్లు పెట్టి దోచుకున్నారు. ఆన్‌లైన్‌లో లిక్కర్ సేల్స్ అంటూ గూగుల్ పే క్యూ ఆర్ కోడ్‌లు పంపించి మనీ కొట్టేశారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో స్పాన్సర్స్ ప్రకటనలు ఇచ్చి.. ఆన్‌లైన్‌లో మందు డోర్ డెలవరీ చేస్తామని వాట్సాప్ చాటింగ్‌లు చేస్తున్నారు. బల్క్ ఆర్డర్ ఇవ్వాలని….డెలవరీ కంటే ముందే 25 నుంచి 50 శాతం ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని…ఇక్కడ పేటీఎం… గూగుల్ పే, ఫోన్ పే వాడాలని సలహాలు ఇస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో ఈ ప్రకటనలు చూసి కొందరు ఇప్పటికే మోస పోయారు. ఇలాంటి ప్రకటనలు చూసి టెంప్ట్ కావొద్దని… అలర్ట్‌గా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.