కరోనా టెస్టులు ఎక్కువ చేస్తే ప్రైజులు ఏమైనా ఇస్తారా? " కేటీఆర్
కరోనా పరీక్షలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణలో ఎక్కువ పరీక్షలు నిర్వహించి… వైరస్ బారినపడిన వారిని ఐసోలేట్ చేయడం చాలా కీలకమని నిపుణులు చెబుతుండగా… కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తే ప్రైజులు ఏమైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలంతా కేసీఆర్ ఏం చెబితే అది చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చికెట్ తినమంటే తింటున్నారు… బత్తాయిలు కొనమంటే కొంటున్నారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఇమేజ్ పెరిగిందని… […]
కరోనా పరీక్షలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణలో ఎక్కువ పరీక్షలు నిర్వహించి… వైరస్ బారినపడిన వారిని ఐసోలేట్ చేయడం చాలా కీలకమని నిపుణులు చెబుతుండగా… కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తే ప్రైజులు ఏమైనా ఇస్తారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రజలంతా కేసీఆర్ ఏం చెబితే అది చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చికెట్ తినమంటే తింటున్నారు… బత్తాయిలు కొనమంటే కొంటున్నారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఇమేజ్ పెరిగిందని… కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటే లక్షల మంది టీవీల ముందు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ సక్సెస్‌పై భవిష్యత్తులో అధ్యయనాలు జరిగి డాక్టరేట్లు వస్తాయన్నారు. ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ట్రైనింగ్‌లో తాను, హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి బలమైన నాయకులం తయారయ్యామని వివరించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.