ఇద్దరు లారీడ్రైవర్లు... 39 మందికి కరోనా
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించి ఎన్నో కఠినమైన నిబంధనలు పెట్టినా కొందరి నిర్లక్ష్యంతో పలువురు కరోనా బాధితులుగా మారుతున్నారు. భౌతిక దూరం, లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనతో ఇతరులకు రోగాన్ని అంటిస్తున్నారు. తాజాగా ఇద్దరు లారీ డ్రైవర్ల నిర్లక్ష్యంతో 39 మందికి కరోనా సోకిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలోని కృష్ణలంకలో నివసించే లారీ డ్రైవర్ పలు మార్లు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగాడు. అంతే కాకుండా ఇంటి వద్ద ఇరుగుపొరుగు వారిని పిలిచి […]
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించి ఎన్నో కఠినమైన నిబంధనలు పెట్టినా కొందరి నిర్లక్ష్యంతో పలువురు కరోనా బాధితులుగా మారుతున్నారు. భౌతిక దూరం, లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనతో ఇతరులకు రోగాన్ని అంటిస్తున్నారు. తాజాగా ఇద్దరు లారీ డ్రైవర్ల నిర్లక్ష్యంతో 39 మందికి కరోనా సోకిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
విజయవాడలోని కృష్ణలంకలో నివసించే లారీ డ్రైవర్ పలు మార్లు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగాడు. అంతే కాకుండా ఇంటి వద్ద ఇరుగుపొరుగు వారిని పిలిచి పేకాట ఆడాడు. అంతే కాకుండా పిల్లలు, మహిళలతో కలసి హౌసీ కూడా ఆడాడు. దీంతో అతనితో సహా 24 మంది కరోనా బారిన పడినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇక విజయవాడ కార్మిక నగర్‌కు చెందిన మరో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వహించి ఇరుగు పొరుగువారిని కలవడం.. వారితో కలసి తిరగడంతో 15 మందికి కరోనా సోకింది. ఈ రెండు ఉదంతాలలో కూడా భౌతిక దూరం పాటించకపోవడం వల్లే 39 మందికి కరోనా సోకిందని కలెక్టర్ తెలిపారు. ఆ 39 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని.. కొంత మందిని క్వారంటైన్ చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం విజయవాడలోని రెండు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ప్రజలెవ్వరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. అలాగే ఆదివారం విజయవాడలో మాంసం, చికెన్, చేపల విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.