మహా కంటే గుజరాత్‌లో వేగంగా కరోనా....
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాధి ఇతర దేశాల కంటే భారత్‌లో తక్కువగానే ఉన్నా… వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. మహారాష్ట్ర కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. ఒకే రోజు దేశంలో రికార్డు స్థాయిలో 1,752 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23వేల 452కు చేరింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉండేది. ఇప్పుడు గుజరాత్‌లో కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా […]
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాధి ఇతర దేశాల కంటే భారత్‌లో తక్కువగానే ఉన్నా… వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. మహారాష్ట్ర కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. ఒకే రోజు దేశంలో రికార్డు స్థాయిలో 1,752 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23వేల 452కు చేరింది.
ఇప్పటి వరకు మహారాష్ట్రలో కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉండేది. ఇప్పుడు గుజరాత్‌లో కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్, సూరత్‌లలో కరోనా రెచ్చిపోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా కేసులు రెట్టింపు అవడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది.
ఈ పరిణామం గుజరాత్ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక్క అహ్మదాబాద్‌లోనే మే 15 నాటికి 50 వేల కరోనా కేసులు, మే చివరకు ఏకంగా 8లక్షల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు ఒక్క అహ్మదాబాద్‌లోనే 1,639 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది ప్రస్తుతం గుజరాత్‌లోనే.
ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం కేసులు 6వేల 430 కాగా… గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 2వేల 624 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 2వేల 376 కేసులు ఉన్నాయి. దేశంలో సగం కేసులు ఈ మూడు రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి.