Telugu Global
Cinema & Entertainment

నాని అందుకు ఒప్పుకున్నాడట....

ఓ సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వకముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవ్వొచ్చా? ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ఒక్క అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ ఒక్క టాపిక్ పై టాలీవుడ్ రెండుగా విడిపోయిన సందర్భం కూడా ఉంది. నిర్మాతలేమో ఓటీటీకి ముందే ఇవ్వడంలో తప్పు లేదంటారు. ఇలా చేయడం వల్ల తమకు వడ్డీలు తగ్గుతాయని, మనీ జనరేట్ అవుతుందని అంటారు. అటు హీరోలు మాత్రం ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల […]

నాని అందుకు ఒప్పుకున్నాడట....
X

ఓ సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వకముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవ్వొచ్చా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ఒక్క అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ ఒక్క టాపిక్ పై టాలీవుడ్ రెండుగా విడిపోయిన సందర్భం కూడా ఉంది. నిర్మాతలేమో ఓటీటీకి ముందే ఇవ్వడంలో తప్పు లేదంటారు. ఇలా చేయడం వల్ల తమకు వడ్డీలు తగ్గుతాయని, మనీ జనరేట్ అవుతుందని అంటారు. అటు హీరోలు మాత్రం ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల తమకు క్రేజ్ తగ్గిపోతుందని, ఫ్యాన్స్ తగ్గిపోతారని ఆందోళన చెందుతున్నారు.

అటు దర్శకుల్లో కూడా సగం మంది ఇటు, సగం మంది అటు అయ్యారు. ఓ సినిమాను థియేటర్ కంటే ముందే ఓటీటీలో వేయడం మంచిదే అంటున్నారు కొందరు దర్శకులు. తాము తీసే సినిమా ఎక్కువమందికి చేరాలంటే ఓటీటీనే మంచి ఆప్షన్ అంటున్నారు. ఓటీటీలో మూవీ క్లిక్ అయితే, ఆటోమేటిగ్గా మరోసారి థియేటర్ కు వస్తారని వీళ్ల అంచనా. మరికొందరు దర్శకులు మాత్రం కేవలం సిల్వర్ స్క్రీన్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తామని, టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తారని, థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిపోతుందని వాదిస్తున్నారు.

వీళ్లందరి వెర్షన్లు ఎలా ఉన్నప్పటికీ నాని మాత్రం తన మనసులో మాట ఓపెన్ గా చెప్పేశాడు. సినిమాను థియేటర్ లో విడుదల చేయడానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టడాన్ని నాని సమర్థించాడు. ప్రస్తుతం ట్రెండ్ మారుతోందని, ఆ ట్రెండ్ కు తగ్గట్టు టాలీవుడ్ కూడా మారాలంటున్నాడు నాని. ప్రస్తుతం నాని ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది.

First Published:  24 April 2020 11:30 AM IST
Next Story