టార్గెట్ చేశారు... మళ్ళీ ఇలా దొరికిపోయారు...
కర్నూలులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 250 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 31 కేసులు తేలడంతో కర్నూలు నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పాటు రాజకీయ రంగు కూడా పులుముకుంది. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా కొన్ని ఫొటోలు పెట్టి తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఒక నర్సు క్వారంటైన్ సెంటర్ లో ముస్లిం పెద్దాయన కాళ్లు […]
కర్నూలులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 250 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 31 కేసులు తేలడంతో కర్నూలు నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పాటు రాజకీయ రంగు కూడా పులుముకుంది.
కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్‌ఖాన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా కొన్ని ఫొటోలు పెట్టి తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.
ఒక నర్సు క్వారంటైన్ సెంటర్ లో ముస్లిం పెద్దాయన కాళ్లు తాకుతున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఎమ్మెల్యే కూడా ఉండడంతో ఆయన్నే లక్ష్యంగా విమర్శలు చెలరేగాయి.
ఎమ్మెల్యే దగ్గరుండి మత పెద్ద కాళ్లు పట్టించాడని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఆ ఫొటో వెనుక ఉన్న అసలు నిజం గురించి వైసీపీ తెలిపింది.
ఇటీవల హఫీజ్ ఖాన్ రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు… ఆయన అక్కడ వైద్య సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయన అక్కడున్న సమయంలో ఒక ముస్లిం పెద్దాయనకు గేటు తగిలి తీవ్ర రక్తస్రావమైందని… విధుల్లో ఉన్న ఒక నర్సు గాయాన్ని శుభ్రం చేసి కాలికి కట్టు కట్టిందని చెప్పింది.
కాటన్‌తో కాలిని శుభ్రం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే అటుగా వచ్చారని… ఏమైంది అని అడిగారని… 108కి ఫోన్ చేయమంటారా? రక్తం ఎక్కువ కారుతుందా? అని ప్రశ్నించారు. 108కి ఫోన్ చేశాం… వస్తుంది అని ఫర్వాలేదని జవాబు ఇచ్చింది.
ఈ ఒక్క ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టిన ఫొటో కూడా ఉంది. కానీ అవేమి పట్టించుకోకుండా… ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతుండగా… నర్సు అలా కాటన్‌తో కాలును పట్టుకుంది. యాదృచ్చికంగా జరిగిన ఈ ఘటనతో ఎవరికి వారు సొంత కవిత్వం జోడిస్తూ ఈ ఫొటో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అసలు నిజం తెలుసుకోవాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.
ఇటు ఏపీలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 893 పాజిటివ్ కేసులకు గాను 141 మంది డిశ్చార్జ్ కాగా, 27 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 725.
Fake news alert / Fact news of the incident
Publiée par Hafeez Khan sur Mercredi 22 avril 2020