Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ ను నేను ప్రేమించడం లేదు

ఓవైపు ప్రభాస్-అనుష్క రిలేషన్ షిప్ పై పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ గాసిప్స్ బయల్దేరాయి. వీటిని ఆ హీరోహీరోయిన్లు ఇద్దరూ ఖండించినప్పటికీ అవి ఆగలేదు. ఇదే గ్యాప్ లో ఆమధ్య ప్రభాస్-నిహారిక అంటూ మరో గాసిప్ కూడా బయల్దేరింది. నిహారికను ప్రభాస్ కు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిపై నిహారిక స్పందించింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన నిహారిక కొణిదల.. తను ప్రభాస్ […]

ప్రభాస్ ను నేను ప్రేమించడం లేదు
X

ఓవైపు ప్రభాస్-అనుష్క రిలేషన్ షిప్ పై పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ గాసిప్స్ బయల్దేరాయి. వీటిని ఆ హీరోహీరోయిన్లు ఇద్దరూ ఖండించినప్పటికీ అవి ఆగలేదు. ఇదే గ్యాప్ లో ఆమధ్య ప్రభాస్-నిహారిక అంటూ మరో గాసిప్ కూడా బయల్దేరింది. నిహారికను ప్రభాస్ కు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిపై నిహారిక స్పందించింది.

ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన నిహారిక కొణిదల.. తను ప్రభాస్ ను ప్రేమిచండం లేదని స్పష్టంచేసింది. పెళ్లి ప్రతిపాదన కూడా లేదని అంటోంది. గతంలో ఇలానే నాగశౌర్య పేరు తెరపైకి వచ్చిందని, ఇప్పుడు ప్రభాస్ పేరు కూడా వచ్చిందంటోంది నిహారిక. అయినా “ప్రభాస్ ఎక్కడ.. నేనెక్కడ” అంటూ ఓ అదిరిపోయే స్టేట్ మెంట్ కూడా పడేసింది ఈ మెగా డాటర్.

సినిమాల కంటే వెబ్ సిరీస్ లపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలిపింది నిహారిక. చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా ఉందని, అది కూడా తమిళ సినిమా అని స్పష్టంచేసిన నిహారిక.. మరో 3 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయని, వాటిలో ఒకటి పిక్ చేసుకోవాలా లేక వెబ్ సిరీస్ వైపు అడుగులు వేద్దామా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది.

First Published:  23 April 2020 3:33 AM IST
Next Story