లాక్‌డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు
కరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ శుక్రవారానికి నెల రోజులు పూర్తవుతుంది. ఇప్పటికే ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇవ్వగా.. రేపటి నుంచి మరిన్ని మినహాయింపులు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్ జోన్ లలో ఉండే ఎలక్ట్రిక్ దుకాణాలు, స్టేషనరీ షాపులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతే కాకుండా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, మొబైల్ రీచార్జి […]
కరోనా కట్టడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ శుక్రవారానికి నెల రోజులు పూర్తవుతుంది. ఇప్పటికే ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇవ్వగా.. రేపటి నుంచి మరిన్ని మినహాయింపులు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ తెలిపారు.
అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్ జోన్ లలో ఉండే ఎలక్ట్రిక్ దుకాణాలు, స్టేషనరీ షాపులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతే కాకుండా మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, మొబైల్ రీచార్జి దుకాణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పని చేస్తాయని ఆమె తెలిపారు. కేవలం నాన్ హాట్‌స్పాట్ జోన్ లకు మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్ డౌన్ పొడిగించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు వర్తింపచేయమని చెప్పింది. దీంతో తెలంగాణలో యధావిధిగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఈ మినహాయింపులకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.