లాక్ డౌన్ ఎఫెక్ట్.... 'తిక్క'ను ఇలా వదులుతున్నారు....
కొన్ని సినిమాలు ప్రేక్షకులకే కాదు టీవీ ఛానెళ్లకు కూడా చుక్కలు చూపిస్తాయి. ఉదాహరణకు అజ్ఞాతవాసి సినిమానే తీసుకుంటే.. ఆ డిజాస్టర్ మూవీని ప్రసారం చేయడానికి జెమినీ టీవీ ఏడాది టైమ్ తీసుకుంది. బ్రహ్మోత్సవం సినిమానైతే జీ తెలుగు ఛానెల్ ఓసారి ప్రసారం చేసి ఆ తర్వాత దాని జోలికి వెళ్లలేదు. ప్రతి ఛానెల్ లో ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. స్టార్ మా ఛానెల్ వద్ద కూడా అలాంటి “ఆణిముత్యం” ఒకటుంది. ఎట్టకేలకు దాన్ని బయటకుతీసింది ఆ […]
కొన్ని సినిమాలు ప్రేక్షకులకే కాదు టీవీ ఛానెళ్లకు కూడా చుక్కలు చూపిస్తాయి. ఉదాహరణకు అజ్ఞాతవాసి సినిమానే తీసుకుంటే.. ఆ డిజాస్టర్ మూవీని ప్రసారం చేయడానికి జెమినీ టీవీ ఏడాది టైమ్ తీసుకుంది. బ్రహ్మోత్సవం సినిమానైతే జీ తెలుగు ఛానెల్ ఓసారి ప్రసారం చేసి ఆ తర్వాత దాని జోలికి వెళ్లలేదు. ప్రతి ఛానెల్ లో ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. స్టార్ మా ఛానెల్ వద్ద కూడా అలాంటి “ఆణిముత్యం” ఒకటుంది. ఎట్టకేలకు దాన్ని బయటకుతీసింది ఆ ఛానెల్.
సాయితేజ్ హీరోగా నటించిన తిక్క సినిమాను స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయబోతోంది. సాయితేజ్ కెరీర్ లో ఎన్నో డిజాస్టర్స్ ఉండొచ్చు. కానీ తిక్క సినిమా లెక్క వేరు. అది డిజాస్టర్స్ కే బాప్ అనిపించుకుంది. విడుదలైన రోజు రెండో ఆటకే తట్టాబుట్టా సర్దేసిన సినిమా అది. అందుకే ఆ సినిమాను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకుంది స్టార్ మా యాజమాన్యం.
అయితే ఇది లాక్ డౌన్ టైమ్. ప్రేక్షకులకు కొత్తగా ఏదో ఒకటి చూపించాలి. అటు జెమినీ ఛానెల్ అల వైకుంఠపురములో, భీష్మ, సరిలేరు నీకెవ్వరు లాంటి కొత్త సినిమాలతో దూసుకుపోతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరేళ్లుగా దాస్తున్న తిక్క సినిమాను జనాలపైకి వదలడానికి సిద్ధమైంది స్టార్ మా. ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ ఈ సినిమా ప్రోమోలు తిరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల మీదుకు రాబోతోంది తిక్క.