Telugu Global
National

దేశ వ్యాప్తంగా 20 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. 20 వేల 471 కి చేరింది. బుధవారం ఒక్కరోజే 1,486 పాజిటివ్‌ కేసులు తేలాయి. గత 24 గంటల్లో 49 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 652కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 19.36గా ఉంది. ఒక రోజులో 618 మంది కోలుకుంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులకు కేసులు రెట్టింపు అయ్యేవి… లాక్‌డౌన్‌ తర్వాత […]

దేశ వ్యాప్తంగా 20 వేలు దాటిన కరోనా కేసులు
X

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. 20 వేల 471 కి చేరింది. బుధవారం ఒక్కరోజే 1,486 పాజిటివ్‌ కేసులు తేలాయి. గత 24 గంటల్లో 49 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 652కి చేరింది.

దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 19.36గా ఉంది. ఒక రోజులో 618 మంది కోలుకుంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులకు కేసులు రెట్టింపు అయ్యేవి… లాక్‌డౌన్‌ తర్వాత 7.5 రోజులకు రెట్టింపు అవుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 430 జిల్లాల్లో వైరస్‌ వ్యాపించింది. ముంబైలో మూడు వేల కేసులు నమోదు అయితే ఢిల్లీలో 2081, అహ్మదాబాద్‌ లో 1298, ఇండోర్‌ లో 915, పుణే లో 660. జైపూర్‌ లో 537 మంది కరోనా బాధితులు తేలారు.

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. మొత్తం 813 పాజిటివ్ కేసుల్లో 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 669.

24 గంటల్లో గుంటూరులో 19, కర్నూలులో 19, చిత్తూరు 6, కడప 5, కృష్ణా 3, ప్రకాశం 4 పాజిటివ్‌ కేసులు తేలాయి.

First Published:  23 April 2020 2:26 AM IST
Next Story