Telugu Global
Cinema & Entertainment

రాశిఖన్నా ఫస్ట్ డేటింగ్ ఇదే...

తన తొలి డేటింగ్ విశేషాల్ని బయటపెట్టింది హీరోయిన్ రాశిఖన్నా. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా తన తొలి ప్రేమ అనుభూతుల్ని ప్రేక్షకులతో పంచుకుంది. అయితే అది డేటింగ్ అనే విషయం కూడా తనకు తెలియదని, ఆ వయసులో అది అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. “అప్పుడు నాకు 16 ఏళ్లు. నా క్లాస్ మేట్ నన్ను డేటింగ్ కు పిలిచాడు. నిజానికి అది డేటింగ్ అని […]

రాశిఖన్నా ఫస్ట్ డేటింగ్ ఇదే...
X

తన తొలి డేటింగ్ విశేషాల్ని బయటపెట్టింది హీరోయిన్ రాశిఖన్నా. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా తన తొలి ప్రేమ అనుభూతుల్ని ప్రేక్షకులతో పంచుకుంది. అయితే అది డేటింగ్ అనే విషయం కూడా తనకు తెలియదని, ఆ వయసులో అది అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చింది.

“అప్పుడు నాకు 16 ఏళ్లు. నా క్లాస్ మేట్ నన్ను డేటింగ్ కు పిలిచాడు. నిజానికి అది డేటింగ్ అని నాకు తెలియదు. తన పుట్టినరోజు అని చెప్పి పార్టీ ఇస్తానంటే వెళ్లాను. మా ఇంటికి దగ్గర్లో మెక్ డొనాల్డ్స్ ఉంది. అక్కడికి వెళ్లాం. అప్పటికే మంచి ఆకలి మీద ఉన్నాను. ఫుల్ గా ఆర్డర్ ఇచ్చి నచ్చినవన్నీ తినేశాను. బిల్లు అతడే కట్టాడు. రెస్టారెంట్ లో ఉన్నంతసేపు నన్ను పొగుడుతూనే ఉన్నాను. నేనేం మాట్లాడలేదు. జస్ట్ స్మైల్ మాత్రమే ఇచ్చాను. అలా నా ఫస్ట్ డేట్ ముగిసింది. ఆ అబ్బాయి మాత్రం చాలా మంచోడు.”

ఇలా తన ఫస్ట్ డేట్ ముచ్చట్లను బయటపెట్టింది రాశిఖన్నా. 16 ఏళ్ల వయసులో జరిగిన ఆ మీటింగ్ తన ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ అంటోంది రాశిఖన్నా. ఆ తర్వాత మరే వ్యక్తితో కలిసి డేట్ కు వెళ్లలేదని అంటోంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఎవరితో డేటింగ్ చేయలేదంటోంది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం యాక్టింగ్ మీద ఉందని, అందుకే డేటింగ్-పెళ్లి లాంటి వ్యవహారాలు అప్పుడే పెట్టుకోదలుచుకోలేదంటోంది ఈ బ్యూటీ.

First Published:  22 April 2020 3:15 AM IST
Next Story