అనుష్కపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు...
కొన్ని రోజులుగా అనుష్కపై ఓ రకమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఆమె నటించిన నిశ్శబ్ధం అనే సినిమాను ఓటీటీకి ఇవ్వడానికి నిర్మాత ప్రయత్నిస్తుంటే అనుష్క అడ్డుపడుతోందట. తన సినిమా ముందుగా థియేటర్లలోనే రిలీజ్ అవ్వాలని, ఓటీటీకి ఎంత మాత్రం ఇవ్వడానికి వీళ్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. ఈ మేరకు ఓ బడా నిర్మాత కొడుకు సహకారంతో ఆ డీల్ ను అనుష్క అడ్డుకుందనేది రూమర్. దాదాపు 3 రోజులుగా వినిపిస్తున్న ఈ వార్త పై ఎట్టకేలకు […]
కొన్ని రోజులుగా అనుష్కపై ఓ రకమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఆమె నటించిన నిశ్శబ్ధం అనే సినిమాను ఓటీటీకి ఇవ్వడానికి నిర్మాత ప్రయత్నిస్తుంటే అనుష్క అడ్డుపడుతోందట. తన సినిమా ముందుగా థియేటర్లలోనే రిలీజ్ అవ్వాలని, ఓటీటీకి ఎంత మాత్రం ఇవ్వడానికి వీళ్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. ఈ మేరకు ఓ బడా నిర్మాత కొడుకు సహకారంతో ఆ డీల్ ను అనుష్క అడ్డుకుందనేది రూమర్.
దాదాపు 3 రోజులుగా వినిపిస్తున్న ఈ వార్త పై ఎట్టకేలకు సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అనుష్క బంగారం అంటోంది నిశ్శబ్దం సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు అనుష్క అందిస్తున్న మద్దతు మరువలేనిదని, ఆమెపై వస్తున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేసింది.
ఇకపై తమ సినిమాకు సంబంధించి ఎలాంటి పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. ఏదైనా ఉంటే అధికారికంగా తాము ప్రకటిస్తామని చెబుతోంది.
అంతా బాగానే ఉంది కానీ నిశ్శబ్దం సినిమాను అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీకి ఇచ్చేస్తే బాగుంటుందని, మంచి రేటు వస్తుందని మరో నిర్మాత కోన వెంకట్ ప్రపోజల్ చేశాడని, దాన్ని అనుష్క అడ్డుకుందని వార్తలొచ్చాయి.
ఇప్పుడు వివరణ ఇవ్వడానికి మాత్రం కోన వెంకట్ ముందుకురాలేదు. మరో నిర్మాత నుంచి ఖండన ప్రకటన వచ్చింది. ఈ మతలబు ఏంటో ఆ యూనిట్ కే తెలియాలి.