Telugu Global
Cinema & Entertainment

ముగ్గురు దర్శకులకు చిరు ఓకే.... కానీ

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ కార్మికులను ఆదుకునే విషయంలో చారిటీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి వారికి సాయం చేస్తున్నాడు. దాంతోపాటు ఈ లాక్ డౌన్ లో కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఈ ఖాళీటైంలో ఏం ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తున్నారు. తదుపరి, ప్రస్తుతం నడుస్తున్న చిత్రాల గురించి ఆలోచించడం లేదు. అయితే చిరంజీవి మాత్రం ఆశ్చర్యకరంగా కొరటాల శివతో ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ సెట్స్ లో ఉండగానే తన తదుపరి చిత్రం […]

ముగ్గురు దర్శకులకు చిరు ఓకే.... కానీ
X

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ కార్మికులను ఆదుకునే విషయంలో చారిటీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి వారికి సాయం చేస్తున్నాడు. దాంతోపాటు ఈ లాక్ డౌన్ లో కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఈ ఖాళీటైంలో ఏం ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తున్నారు. తదుపరి, ప్రస్తుతం నడుస్తున్న చిత్రాల గురించి ఆలోచించడం లేదు.

అయితే చిరంజీవి మాత్రం ఆశ్చర్యకరంగా కొరటాల శివతో ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ సెట్స్ లో ఉండగానే తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఏకంగా మూడు చిత్రాలను లైన్లో పెట్టినట్టు తెలిసింది.

తాజాగా చిరంజీవి ఏకంగా ముగ్గురు దర్శకులతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. వీరి ముగ్గురి కథలు విన్న చిరంజీవి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఇందులో దర్శకుడు బాబీతోపాటు సుజిత్, మెహర్ రమేష్ లతో సినిమాలు చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

అయితే బాబీ గురించి ఇదివరకే లీక్ అయ్యింది. అతడి ట్రాక్ రికార్డ్ కూడా ఫర్వాలేదు. అయితే ఫ్లాప్ డైరెక్టర్లు సుజిత్, మెహర్ రమేష్ లతో చిరంజీవి చిత్రాలు ఓకే అనడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహోకు సుజిత్ దర్శకత్వం వహించాడు. ఇది భారీ ఫ్లాప్ అయ్యింది. ఇక దర్శకుడు మెహర్ రమేశ్ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా సాధించలేదు.

మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’ రిమేక్ ను సుజిత్ దర్శకత్వంలో చేయడానికి చిరంజీవి ఓకే చెప్పాడట.. అతను ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభించాడట.. మెహర్ రమేశ్ ఇంకా కథను కూడా రెడీ చేయలేదని తెలుస్తోంది.

బాబీ ఇప్పటికే ఎన్టీఆర్ తో ‘లవకుశ’, వెంకటేశ్, చైతన్యతో ‘వెంకీమామ’ తీశాడు. అవి కమర్షియల్ హిట్స్. బాబీ చెప్పిన కథ చిరంజీవిని ఆకట్టుకుందని తెలిసింది. మరి మెహర్ ఏ కథతో మెప్పిస్తాడన్నది వేచిచూడాలి.

First Published:  22 April 2020 9:00 AM GMT
Next Story