Telugu Global
International

చైనా ర్యాపిడ్‌ కిట్స్‌.... వద్దేవద్దంటున్న రాష్ట్రాలు

చైనా ర్యాపిడ్‌ కిట్లు క్వాలిటీగా లేవని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఆ దేశం నుంచి కిట్ల దిగుమతి నిలిపివేయాలని కోరింది. రాజస్థాన్‌ ఇప్పటికే చైనా ర్యాపిడ్‌ కిట్లను ఉపయోగించడం నిలిపివేసింది. చైనా కిట్స్‌ ద్వారా చేసిన పరీక్షల్లో  కేవలం 5.4 శాతం మాత్రమే ఆక్యురేషన్‌ వస్తోందని రాజస్థాన్‌ అధికారులు తెలిపారు. దీంతో కేంద్రం ర్యాపిడ్‌ కిట్స్ ద్వారా పరీక్షలను రెండు రోజులు నిలిపివేయాలని కోరింది. రాజస్థాన్‌తో పాటు తమిళనాడు, కేరళ కూడా ర్యాపిడ్‌ కిట్లపై […]

చైనా ర్యాపిడ్‌ కిట్స్‌.... వద్దేవద్దంటున్న రాష్ట్రాలు
X

చైనా ర్యాపిడ్‌ కిట్లు క్వాలిటీగా లేవని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఆ దేశం నుంచి కిట్ల దిగుమతి నిలిపివేయాలని కోరింది. రాజస్థాన్‌ ఇప్పటికే చైనా ర్యాపిడ్‌ కిట్లను ఉపయోగించడం నిలిపివేసింది.

చైనా కిట్స్‌ ద్వారా చేసిన పరీక్షల్లో కేవలం 5.4 శాతం మాత్రమే ఆక్యురేషన్‌ వస్తోందని రాజస్థాన్‌ అధికారులు తెలిపారు. దీంతో కేంద్రం ర్యాపిడ్‌ కిట్స్ ద్వారా పరీక్షలను రెండు రోజులు నిలిపివేయాలని కోరింది.

రాజస్థాన్‌తో పాటు తమిళనాడు, కేరళ కూడా ర్యాపిడ్‌ కిట్లపై అనుమానాలు వ్యక్తం చేశాయి. నిర్ధిష్ట ఫలితాలు రావడం లేదని కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.

రాజస్థాన్‌లో శుక్రవారం నుంచి హాట్‌స్పాట్‌ ప్రాంతంలో 170 మందికి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన వారికి ఈ కిట్ల ద్వారా పరీక్షలు జరిపితే నెగటివ్‌ వచ్చింది. దీంతో కిట్ల సామర్థ్యంపై అనుమానాలు ఏర్పడ్డాయి.

ఈ నెల మొదటి వారంలోనే చైనా నుంచి ఏడు లక్షల కిట్లను కేంద్రం తెప్పించింది. వివిధ రాష్ట్రాలకు అందించింది. నాలుగు రోజుల కిందట ఈ కిట్ల ద్వారా హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో పరీక్షలు మొదలుపెట్టారు. ఇలాంటి రిజల్ట్స్‌ రావడంతో కేంద్రం కంగుతింది. మామూలుగా అయితే ల్యాబ్ లలో పరీక్షలు జరిపితే ఆరుగంటల సమయం పడుతోంది. అయితే ఈ ర్యాపిడ్‌ కిట్ల ద్వారా అయితే 30 నిమిషాల్లో ఫలితం వస్తుంది.

పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు రావడంతో రెండు రోజుల పాటు ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను వాడరాదని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఫీల్డ్‌లో ఐసీఎంఆర్‌ బృందాలు పర్యటించి, ర్యాపిడ్‌ టెస్టింగ్‌పై పరీక్షలు చేస్తాయని, ఈ పరీక్షల తరువాత కిట్లపై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ డైరెక్టర్‌ రామన్‌ గంగాకేడ్కర్‌ తెలిపారు .

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు లక్షల 49 వేల 810 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. రెండు రోజుల తరువాత రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లపై రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు.

First Published:  22 April 2020 2:29 AM IST
Next Story