Telugu Global
National

పవన్ ఫ్యాన్ కు క్లాస్ పీకిన రేణు

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా నిన్నటితో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను, ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న పూరి జగన్నాధ్ ను అంతా ఆకాశానికెత్తేశారు. అదే టైమ్ లో హీరోయిన్ రేణుదేశాయ్ ను చాలామంది మరిచిపోయారు. బద్రి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది రేణుదేశాయ్. పవన్ తో ఆమె ప్రేమలో పడడానికి కూడా ఈ సినిమానే కారణం. తన కెరీర్ కే కాకుండా, తన జీవితంతో కూడా ముడిపడిన ఆ […]

పవన్ ఫ్యాన్ కు క్లాస్ పీకిన రేణు
X

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా నిన్నటితో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను, ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న పూరి జగన్నాధ్ ను అంతా ఆకాశానికెత్తేశారు. అదే టైమ్ లో హీరోయిన్ రేణుదేశాయ్ ను చాలామంది మరిచిపోయారు. బద్రి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది రేణుదేశాయ్. పవన్ తో ఆమె ప్రేమలో పడడానికి కూడా ఈ సినిమానే కారణం. తన కెరీర్ కే కాకుండా, తన జీవితంతో కూడా ముడిపడిన ఆ సినిమాను మరిచిపోతే ఎలా?

అందుకే బద్రి సినిమాను ప్రస్తావించింది రేణుదేశాయ్. ఓ స్టిల్ ను పోస్ట్ చేసి అప్పటి తన అనుభూతుల్ని, అనుభవాల్ని పంచుకుంది. అయితే పవన్ ఫ్యాన్స్ ఊరుకోలేదు. పవన్ ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేవా అంటూ పోస్టులు పెట్టారు. అప్పట్లో పవన్ కు వ్యతిరేకంగా చాలా ఓవరాక్షన్ చేసి, ఇప్పుడు మళ్లీ ఈ పోస్టులు ఎందుకంటూ ట్రోల్ చేశారు. దీనిపై రేణు దేశాయ్ కూడా గట్టిగానే స్పందించింది.

“బద్రి గురించి నేను ప్రస్తావించడం అవసరమే. ఆ సినిమా 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇది నా మొదటి సినిమా అనే విషయాన్ని చాలామంది మరిచిపోతారు. కాబట్టి ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నాపై ఇంత ద్వేషం ఎందుకు? ఈ వైరస్ వల్ల మనం ఆల్రెడీ ఓ ప్రపంచ సంక్షోభంలో ఉన్నాం. కాబట్టి కాస్త మంచిగా ఆలోచిస్తే అందరికీ మంచిది. ఇంత కోపం మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.”

ఇలా సున్నితంగానే పవన్ ఫ్యాన్ కు క్లాస్ పీకింది రేణుదేశాయ్. బద్రి గురించి మాట్లాడే అర్హతలన్నీ తనకు ఉన్నాయని, ఈ విషయంలో ట్రోలింగ్ చేస్తే సహించేది లేదని గట్టిగా బదులిచ్చింది.

First Published:  21 April 2020 2:30 AM IST
Next Story