Telugu Global
NEWS

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్కొక్కరికి 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించింది. కరోనా నివారణ చర్యల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు ముందుండి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ బీమా సౌకర్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ప్రధాని గరీబ్ కల్యాణ్‌ ప్యాకేజ్‌ కింద ఈ బీమాను కల్పిస్తారు. కరోనా నివారణ చర్యలు, కుటుంబ సర్వే వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లకు బీమా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ […]

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్కొక్కరికి 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించింది.

కరోనా నివారణ చర్యల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు ముందుండి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ బీమా సౌకర్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ప్రధాని గరీబ్ కల్యాణ్‌ ప్యాకేజ్‌ కింద ఈ బీమాను కల్పిస్తారు.

కరోనా నివారణ చర్యలు, కుటుంబ సర్వే వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లకు బీమా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం భావించింది.

ప్రస్తుతం ఏపీలో 2 లక్షల 60వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వారందరికీ బీమా వర్తిస్తుంది. ఇప్పటికే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి బీమాను కల్పించారు.

First Published:  21 April 2020 12:42 PM IST
Next Story