ఆ అవసరం నాకు రాదు " రాజమౌళి
రాజమౌళి సినిమాలకు కథ అందించేది వాళ్ల తండ్రి విజయేంద్రప్రసాద్. రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచి ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకు ఈయనే కథా రచయిత. మరి ఇండస్ట్రీలో ఉన్న ఇతర రచయితల సంగతేంటి? సరిగ్గా ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దీనికి సూటిగా సమాధానం ఇచ్చారు రాజమౌళి. పరిశ్రమలో ఇతర రచయితలతో పనిచేసే అవసరం తనకు రాదంటున్నాడు రాజమౌళి. ఎందుకంటే దాదాపు 30 ఏళ్లుగా తండ్రితో కలిసి కథా చర్చలు చేస్తున్న రాజమౌళి వద్ద […]
రాజమౌళి సినిమాలకు కథ అందించేది వాళ్ల తండ్రి విజయేంద్రప్రసాద్. రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచి ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకు ఈయనే కథా రచయిత. మరి ఇండస్ట్రీలో ఉన్న ఇతర రచయితల సంగతేంటి? సరిగ్గా ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దీనికి సూటిగా సమాధానం ఇచ్చారు రాజమౌళి.
పరిశ్రమలో ఇతర రచయితలతో పనిచేసే అవసరం తనకు రాదంటున్నాడు రాజమౌళి. ఎందుకంటే దాదాపు 30 ఏళ్లుగా తండ్రితో కలిసి కథా చర్చలు చేస్తున్న రాజమౌళి వద్ద చాలా స్టోరీలైన్స్ ఉన్నాయట. అన్నీ తనకు నచ్చినవేనని, బాగా ఎక్సయిట్ అయిన కథలేనని చెబుతున్నాడు. అలాంటప్పుడు ఇతర రచయితల అవసరం తనకేంటని ప్రశ్నిస్తున్నాడు.
అయినప్పటికీ ఇక్కడో చిన్న మెలిక పెట్టాడు జక్కన్న. తన దగ్గరున్న స్టోరీ బ్యాంక్ కంటే గొప్ప ఆలోచనతో, వావ్ అనిపించే కథతో వేరే రచయిత తన దగ్గరకొస్తే.. కచ్చితంగా ఆ సినిమా చేస్తానని ప్రకటించాడు. అయినా ఇంట్లో అంత స్టోరీ బ్యాంక్ పెట్టుకున్న దర్శకుడు మరో రచయితను ఎందుకు ప్రోత్సహిస్తాడు చెప్పండి.
అన్నట్టు ఈ దర్శకుడు అప్పుడే తన నెక్స్ట్ మూవీ పనులు మొదలుపెట్టాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో మూవీ చేయబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమా కోసం తండ్రితో కలిసి కథా చర్చలు ప్రారంభించినట్టు ప్రకటించాడు. ఆర్ఆర్ఆర్ పూర్తయిన వెంటనే మహేష్ బాబు సినిమా స్టార్ట్ అవుతుందంటున్నాడు.