Telugu Global
Cinema & Entertainment

మంచు మనోజ్ ‘అంతా బాగుంటామ్‌రా’కి కేటీఆర్ స్పందన ఇదీ

కరోనా వైరస్ తో ప్రపంచమంతా అతలాకుతలం అయ్యింది. లాక్ డౌన్ ముగిశాక యథాస్థితికి వస్తామా లేదా అన్న భయం వెంటాడుతోంది. గాడిన పడుతామా? ఉద్యోగాలు ఉంటాయా? ఉపాధి, కూలీ పని దొరుకుతుందా? అన్న టెన్షన్ సామాన్యుల్లో ఉంది. ఈ నేపథ్యంలో అందరికీ భరోసా కల్పిస్తూ మంచు మనోజ్ స్వయంగా పాడి నటించిన ‘అంతా బాగుంటామ్‌రా’ అనే పాటను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ పాటకు అభిమానులు, సినీ పరిశ్రమల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రజలలో విశ్వాసం […]

మంచు మనోజ్  ‘అంతా బాగుంటామ్‌రా’కి  కేటీఆర్ స్పందన ఇదీ
X

కరోనా వైరస్ తో ప్రపంచమంతా అతలాకుతలం అయ్యింది. లాక్ డౌన్ ముగిశాక యథాస్థితికి వస్తామా లేదా అన్న భయం వెంటాడుతోంది. గాడిన పడుతామా? ఉద్యోగాలు ఉంటాయా? ఉపాధి, కూలీ పని దొరుకుతుందా? అన్న టెన్షన్ సామాన్యుల్లో ఉంది.

ఈ నేపథ్యంలో అందరికీ భరోసా కల్పిస్తూ మంచు మనోజ్ స్వయంగా పాడి నటించిన ‘అంతా బాగుంటామ్‌రా’ అనే పాటను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ పాటకు అభిమానులు, సినీ పరిశ్రమల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రజలలో విశ్వాసం కలిగించడానికి చేసిన ఈ పాటలో కరోనావైరస్ తో పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను కొనియాడుతూ వారికే ఈ పాటను మనోజ్ అంకితం చేశారు.

మంచు మనోజ్ రిలీజ్ చేసిన ఈ పాటను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇదో గొప్ప స్ఫూర్తినిచ్చే పాట అని కేటీఆర్ కొనియాడారు. మన హృదయాల్లో ఆశను నింపుతుందని.. ధైర్యాన్ని నూరిపోసేలా పాట ఉందని మంచు మనోజ్ ను మంత్రి కేటీఆర్ కొనియాడారు.

దీనికి స్పందించిన మంచు మనోజ్.. ‘థ్యాంక్యూ కేటీఆర్ అన్నా అని కృతజ్ఞతలు తెలుపుతూనే… చాలా మంది హృదయాలలో ఈ పాట ధైర్యం ఆశ నింపగలదని నమ్ముతున్నాను’ అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు.

‘అంతా బాగుంటామ్‌రా’ అనే ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించాడు. అచ్చు రాజమణి ఈ పాటను స్వరపరిచాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

మంచు మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రాహ్మాస్త్రి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

First Published:  20 April 2020 9:22 AM IST
Next Story