Telugu Global
National

కన్నాకు షాక్ ఇచ్చిన కర్నాటక సర్కార్‌ ధర

ఏపీ ప్రభుత్వం కరోనా టెస్ట్ కిట్లను ఒక్కొక్కటికి 730 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయడంపై టీడీపీతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపణలు చేశారు. ఎక్కువ ధర చెల్లించారని, కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అయితే కన్నా ఆరోపణలకు బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటకే చెక్ పెట్టింది. ఏపీ కంటే ఎక్కువ ధరకు కర్నాటక ప్రభుత్వం కరోనా టెస్ట్ కిట్లను కొనుగోలు చేయడంతో కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారి నోర్లకు తాళం పడింది. ఏపీ […]

కన్నాకు షాక్ ఇచ్చిన కర్నాటక సర్కార్‌ ధర
X

ఏపీ ప్రభుత్వం కరోనా టెస్ట్ కిట్లను ఒక్కొక్కటికి 730 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయడంపై టీడీపీతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపణలు చేశారు. ఎక్కువ ధర చెల్లించారని, కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అయితే కన్నా ఆరోపణలకు బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటకే చెక్ పెట్టింది.

ఏపీ కంటే ఎక్కువ ధరకు కర్నాటక ప్రభుత్వం కరోనా టెస్ట్ కిట్లను కొనుగోలు చేయడంతో కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారి నోర్లకు తాళం పడింది. ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు 730 చెల్లించగా.. కర్నాటక ప్రభుత్వం ఏకంగా రూ.795 రూపాయలు చెల్లించి హర్యానాలోని ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంది.

అటు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోడీ నేరుగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకున్న టెస్ట్ కిట్ల పనితీరుపై మోడీ ఆరా తీశారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న కిట్లు సకాలంలో అందకపోవడంతో పాటు… వాటి పనితీరులో అనేక లోపాలు ఉన్నట్టు ఫిర్యాదులు వస్తుండడంతో కేంద్రం దక్షిణ కొరియాపై దృష్టి సారించింది.

కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్ల పనితీరు బాగుందని… పది నిమిషాల్లోనే ఫలితాన్ని గుర్తించగలుగుతున్నామని ప్రధానికి జగన్‌మోహన్ రెడ్డి వివరించినట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో వివరించింది. జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దక్షిణ కొరియాతో ఐదు లక్షల కరోనా కిట్లకోసం ఒప్పందం చేసుకుంది.

ఈ మేరకు కొరియాలోని భారత రాయబార కార్యాలయంలో అక్కడి అధికారులతో ఒప్పందాలు జరిగాయి. ఏప్రిల్ 30 నుంచి నాలుగు విడతల్లో ఈ ఐదు లక్షల కిట్లను దక్షిణ కొరియా సరఫరా చేస్తుంది. వీటిని కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాలకు అందిస్తుంది.

ఏపీ ప్రభుత్వం కొరియా నుంచి కిట్లను కొనుగోలు చేసిన తర్వాత చాలా రాష్ట్రాలు కూడా చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ అధికంగా ఉండడంతో అధిక ధర చెల్లించి అయినా సరే టెస్ట్‌ కిట్లను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి.

First Published:  20 April 2020 8:54 AM GMT
Next Story